బీజేపీ ఆఫీస్‌లో అలా.. రైల్వే ఉద్యోగి ఇలా! | KERALA BJP Office Video Sparks Controversy Railway Worker Wins Praise | Sakshi
Sakshi News home page

బీజేపీ ఆఫీస్‌లో అలా.. రైల్వే ఉద్యోగి ఇలా!

Aug 13 2026 8:18 AM | Updated on Aug 13 2026 8:32 AM

KERALA BJP Office Video Sparks Controversy Railway Worker Wins Praise

పంద్రాగస్టు వేడుకలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. జాతీయ పతాకం గౌరవంపై రెండు ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కేరళలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాకాలు మూలన పడేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్‌ కావడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరో వీడియో ద్వారా జాతీయ జెండా పట్ల గౌరవం, బాధ్యతపై చర్చ మొదలైంది.

కేరళలోని కాసర్‌గోడ్‌ బీజేపీ జిల్లా కార్యాలయంలో కొన్ని త్రివర్ణ పతాకాలు ఒక మూలన పడేసినట్లు చూపిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ డీవైఎఫ్‌ఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.

జాతీయ పతాకాన్ని అవమానించడం చట్టం ప్రకారం ‘Prevention of Insults to National Honour Act, 1971’ కింద నేరమని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే వైరల్‌ వీడియోపై బీజేపీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

మరోవైపు.. రైల్వే ఉద్యోగి చేసిన ఓ చిన్న పని మాత్రం ప్రశంసలు అందుకుంది. దుమ్ముతో నిండిపోయిన రైలింజిన్‌ ముందు భాగంలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఓ ఉద్యోగి నీటితో శుభ్రం చేసి, వస్త్రంతో తుడిచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ పతాకం పట్ల చూపిన గౌరవానికి నెటిజన్లు అభినందనలు తెలిపారు. సాధారణ విధుల్లో భాగంగా చేసిన పని అయినప్పటికీ.. జాతీయ చిహ్నాల పట్ల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని పలువురు స్పందించారు.

ఒకవైపు పతాకాల నిర్లక్ష్యంపై వివాదం.. మరోవైపు పతాకానికి గౌరవం తెలిపిన చర్య.. జాతీయ జెండా పట్ల మన బాధ్యతపై మరోసారి చర్చకు దారితీశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement