breaking news
disrespect
-
రాష్ట్రపతిని కించపర్చారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వరుస పరాజయాలను ఆ పార్టీ జీరి్ణంచుకోలేకపోతోందని అన్నారు. తనపై ఎంత విద్వేషం గుమ్మరించినా తనను సమాధి చేయడం కాంగ్రెస్ పార్టీ తరం కాదని తేలి్చచెప్పారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. దాదాపు 100 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడం పట్ల విచారం వ్యక్తంచేశారు. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్న పేద గిరిజన మహిళను, రాజ్యాంగబద్ధమైన పదవిని, భారత రాజ్యాంగాన్ని ఆ పార్టీ కించపర్చిందని మండిపడ్డారు. దళితులను, గిరిజనులను, ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కూడా కించపర్చిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూను ద్రోహి అని నిందించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చొరబాటుదార్లను నిస్సిగ్గుగా కాపాడుతోందని మండిపడ్డారు. ‘ప్రేమ దుకాణం’ అంటూ కల్ల»ొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోదీ.. తేరీ ఖబర్ ఖుదేగీ(మోదీ.. నీ సమాధి తవ్వుతాం) అంటూ నినాదాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అది వారి తరం కాదని అన్నారు. పేద కుటుంబంలో జని్మంచిన తాను ఉన్నత స్థానానికి చేరుకోవడం, ఈ పదవి ఇంకా కొనసాగుతుండడం చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, అందుకే నిత్యం తనను దూషిస్తోందని విమర్శించారు. ప్రధానమంత్రి పదవిని వారి కుటుంబ హక్కుగా భావిస్తున్నారని సోనియా గాంధీ కుటుంబంపై మండిపడ్డారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రతిపక్షాల వల్లే లోక్‌సభకు వెళ్లలేకపోయా.. ‘‘దేశంలో కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, పేదల ఆశీస్సులు నాకున్నాయి. వారి సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నా. ప్రజల అండదండలున్న నన్ను ఏమీ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను ఒక సమస్యగా పరిగణిస్తోంది. కానీ, మేము ప్రజలను ఒక బలంగా, సవాళ్లకు పరిష్కారంగా భావిస్తున్నాం. బుధవారం లోక్‌సభలో జరిగిన పరిణామాలు నిజంగా బాధాకరం. ప్రతిపక్షాలు అలజడి సృష్టించడం వల్లనే సభకు వెళ్లలేకపోయా. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. సభాపతి స్థానంలో ఉన్న అస్సాం ఎంపీపై, ఆంధ్రప్రదేశ్ దళిత ఎంపీపై పేపర్లు విసిరేశారు. అస్సాం ప్రజలను.. మొత్తం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను అవమానించారు. దళితులను అవమానించారు. కాంగ్రెస్ వల్ల అస్సాం గాయకుడు భూపేన్ హజారికా ఎన్నో అవమానాలకు గురయ్యారు. సదానందన్ మాస్టర్‌ను అవమానించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బిట్టూను కాంగ్రెస్ నాయకుడొకరు(రాహుల్ గాం«దీ) బుధవారం ద్రోహి అంటూ దూషించారు. ఆ పార్టీకి సిక్కులంటే ద్వేషం. కాంగ్రెస్ నుంచి ఎన్నో గ్రూప్‌లు విడిపోయాయి. ఎంతోమంది ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. బిట్టూ సిక్కు కాబట్టి ద్రోహి అని నిందించారు. ఇది సిక్కులకు, గురువులకు జరిగిన అవమానం. సిక్కుల పట్ల విద్వేషాన్ని కాంగ్రెస్ మరోసారి బయటపెట్టుకుంది. నిన్న రాజ్యసభలో స్వతంత్ర సభ్యుడు సదానందన్ మాస్టర్ తన కృత్రిమ కాలును ప్రదర్శిస్తే ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఆయన గొప్ప విలువలున్న వ్యక్తి. రాజకీయ గొడవల వల్ల మూడు దశాబ్దాల క్రితం కాలు పోగొట్టుకున్నారు. ఆయనను అవమానించడం మొత్తం దేశానికి బాధ కలిగించింది. అందుకు విపక్ష ఇండియా కూటమి బాధ్యత వహించాలి. ఓట్ల కోసం చొరబాటుదార్లను రక్షిస్తున్నారు ‘‘పశ్చిమ బెంగాల్లో దయలేని ప్రభుత్వం అధికారం చెలాయిస్తోంది. పతనం కావడంతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఓట్ల కోసం చొరబాటుదార్లను కాపాడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారం కోసం దేశాన్ని నాశనం చేయొద్దు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం చొరబాటుదార్లను సహించవు. వారిని బయటకు వెళ్లగొడతాయి. మనదేశంలో మాత్రం చొరబాటుదార్లను రక్షించే పరిస్థితులున్నాయి. అందుకోసం కోర్టులపైనా ఒత్తిడి తెస్తున్నారు. మన యువత హక్కులను లాక్కొని, గిరిజనుల భూములను కబ్జా చేస్తున్నవారిని కాపాడడం ఏమిటి? మన ఆడబిడ్డలు, కుమారుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నవారిని రక్షించడం తగదు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు దశాబ్దాలపాటు అధికారం అనుభవించాయి. అధికారంలో ఉన్నప్పుడు సొంత లాభం చూసుకోవడం తప్ప ప్రజల బాగు కోసం చేసిందేమీ లేదు. నేడు మనం డీల్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. గతంలో డీల్ అంటే బోఫోర్స్ డీల్ మాత్రమే. ప్రజల జీవితాలను మార్చడం వారికి ముఖ్యం కాదు. సొంత జేబులు నింపుకోవడమే ముఖ్యం’’ అని మోదీ ధ్వజమెత్తారు. .నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలి ‘‘అన్ని రంగాల్లో నూతన స్ఫూర్తి, శక్తితో వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇందులో భాగంగా నాణ్యమైన వస్తువుల ఉత్పత్తిపై మనం దృష్టి పెట్టాలి. ఇందుకు ప్రజలు సహకరించాలి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ భారత్’ ప్రపంచమంతటా వినిపించాలి. మన నాణ్యమైన ఉత్పత్తులు అన్ని చోట్లకూ వెళ్లాలి. అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ, అరుదైన ఖనిజాల రంగాల్లో ముందడుగు వేస్తున్నాం. సంస్కరణల ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోంది. గతంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు సంస్కరణల వల్ల లాభాల్లోకి వస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ సంస్కరణలు చేపట్టాం. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన నిర్వాకాలకు ఇప్పుడు ఆ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పులను సరిచేయడానికి మా శక్తిని ఖర్చు పెడుతున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభించడానికి తన స్థానం నుంచి లేవగానే విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్‌ను కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దాంతో మోదీ ప్రసంగం ప్రారంభించారు. దాంతో ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలతో హోరెత్తించారు. నిరసన వ్యక్తంచేశారు. లోక్‌సభలో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవమానాలు సహించబోమని అన్నారు. కూర్చొని నినాదాలు ఇవ్వొచ్చంటూ ఖర్గేకు ప్రధాని మోదీ సూచించారు. కొద్ది సేపటి తర్వాత ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మోదీ ప్రసంగం కొనసాగింది. విపక్ష సభ్యులు బయటకు వచ్చి మకరద్వారం వద్ద నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు. ఆ ఒప్పందాలతో ప్రపంచంలో గొప్ప విశ్వాసం ‘‘యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం తర్వాత అమెరికాతో ఒప్పందానికి వచ్చాం. ఇవి ఫ్యూచర్ రెడీ ఒప్పందాలు. ప్రపంచంలో గొప్ప విశ్వాసం నింపాయి. ప్రపంచ స్థిరత్వానికి ఈ ఒప్పందాలు తోడ్పడుతాయి. గత కొన్నేళ్లలో తొమ్మిది పెద్ద దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. ఇది ఈయూతో కుదిరిన ఒప్పందం ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’. మనం ఇక వెనక్కి చూడాల్సిన అవసరం గానీ, పరుగు ఆపాల్సిన అవసరం గానీ లేదు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన దిశగా వేగంగా దూసుకెళ్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి సమయంలో ప్రపంచమంతటా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత నూతన ప్రపంచ క్రమం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇప్పుడు భారత్ పట్ల ప్రపంచదేశాల్లో గొప్ప విశ్వాసం వ్యక్తమవుతోంది. ఎన్నో దేశాలకు మన దేశం విశ్వసనీయ భాగస్వామిగా మారింది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తులో పాలుపంచుకోవాలని ఇతర దేశాలు కోరుకుంటున్నాయి. అందుకే మనతో ఒప్పందాలకు ముందుకొస్తున్నాయి. దక్షిణార్ధ గోళ దేశాలకు(గ్లోబల్ సౌత్) నేడు మనమే బలమైన గొంతుకగా మారాం’’ అని మోదీ అన్నారు. -
కులగణనపై కాంగ్రెస్ నేత అసమ్మతి వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న దేశవ్యాప్త కులగణన హామీపై ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఆనంద్ శర్మ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రాజకీయాలు చేయలేదని అన్నారు. అదేవిధంగా 1980 ఎన్నికల సమయంలో దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. ‘కులాలపై కాదు.. చేతి గుర్తుపైనే ఓటు ముద్ర’ అని నినాదం చేశారని గుర్తుచేశారు. ఆమె కూడా కుల రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సైతం కులాన్ని ఎన్నికల కోణంలో చూడకూడదని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో కులతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అదేవిధంగా కులరాజకీయాలను వ్యతిరేకించే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆదర్శనాలను అగౌరవపరిచినట్లు అవుతుందని ఆనంద్ శర్మ అన్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లోని కొన్ని పార్టీలు చాలా కాలం నుంచి కుల రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో సామాజిక న్యాయం ప్రాతిపాధికన దేశంలో కుల అసమానతలకు తావు ఇవ్వని పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల గుర్తింపు రాజకీయలు చేయలేదని తెలిపారు. ప్రాంతం, మతం, కులాలు జాతులతో గొప్ప వైవిధ్యాన్ని కనబరిచే భారత సమాజంలో కులతత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని ఆనంద్ శర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కులాని బదులు.. అసమానతలు లేకుండా పేదలకు పథకాలను అమలు చేసి, సామాజిక న్యాయం అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సభలో సైతం రాహుల్ కుల గణన హామీ ఇచ్చారు. -
థాయ్ రాచరికంపై విమర్శలు.. 50 ఏళ్ల జైలు
బ్యాంకాక్: దేశంలోని రాచరిక వ్యవస్థను అగౌరవపరిచిన ఓ వ్యక్తికి థాయ్‌ల్యాండ్ కోర్టు రికార్డు స్థాయిలో 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్న థాయ్‌ల్యాండ్‌లో ఇంతటి భారీ శిక్షను విధించడం ఇదే మొదటిసారని హక్కుల సంఘాలు అంటున్నాయి. చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌కు చెందిన మొంగ్కొల్ తిరఖోట్(30) ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. రాజకీయ హక్కుల కార్యకర్త కూడా. రాజు ప్రతిష్టకు భంగం కలిగేలా ఆన్లైన్లో పోస్టులు పెట్టారంటూ 2023లో కోర్టు ఈయనకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 12కు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో గురువారం ఆయనకు మరో 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రపంచంలోనే అత్యంత కఠిన రాజరిక చట్టాలు థాయ్‌ల్యాండ్‌లో అమలవుతున్నాయి. రాజు, రాణి, వారసులను విమర్శిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. -
రెండు దేశాలకు మంచిది కాదు.. భారత విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: కెనడాలో బ్రాంప్టన్ నగరంలో ఆపరేషన్ బ్లూ జరిగి 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన ఉత్సవాల్లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ఒక శకటంపై ప్రదర్శిస్తూ 5కి.మీ మేర ర్యాలీ చేసి భారతదేశ ప్రతిష్టను మంటగలిపేలా ప్రవర్తించారు. దీనిపై స్పందిస్తూ ఈ హేయమైన చర్యకు పాల్పడినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, రాష్ట్ర వ్యవహారాల మంత్రి మీనాక్షి లేఖి. పాశవికమైన చర్య.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఒకరిని హత్య చేయడమనేది నేరంగానే పరిగణిస్తారు. ఇలా వేరొకరి హత్యను బట్టి ఆనందిస్తూ సంబరాల్లా జరుపుకోవడం పాశవికం. దీన్ని శాంతిభద్రతల ఉల్లంఘనగా పరిగణించి కెనడా ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయం.. అంతకుముందు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ హేయమైన చర్యపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఇటువంటి చర్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలకు మంచిది కాదన్నారు. ఈ సంఘటన వెనుక అంతర్లీనంగా మరో కారణం దాగుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఎవరైనా ఇలాంటి దారుణానికి ఒడిగడతారా? ఇది వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను ప్రేరేపించేవారి చర్యే. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలకు కెనడా దేశానికి కూడా మంచిది కాదని అన్నారు. ఇది కూడా చదవండి: మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే.. -
వైట్‌హౌస్‌లో సభ్యత మరిచిన ట్రంప్ సహాయిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు.. ఆయన సహాయకులు, పాలక వర్గం కూడా కాసింత వివాదాలకు తావిచ్చే మనుషులేనని మరోసారి స్పష్టమైంది. అమెరికా శ్వేతసౌదాన్ని అక్కడి వారు ఎంతో పవిత్రంగా చూస్తారు. అలాంటిది సాక్షాత్తు ట్రంప్ ఆయన వర్గమంతా ఓ ఫొటోకు పోజిస్తుండగా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ సలహాదారురాలు కెల్యానే కాన్వే కాస్తంత అమార్యదకు నడుచుకున్నారు. శ్వేత సౌదంలోని సోఫాపై తన షూ కూడా తీయకుండానే మోకాళ్లపై కూర్చుని సరదాగా నవ్వుతూ కనిపించారు. ఈ విషయాన్ని ఎవరూ గమనించపోయినా ఓ ఫొటో గ్రాఫర్ క్లిక్‌మనిపించారు. ఇప్పుడది బయటకు రావడంతో ఆమెపై ట్విట్టర్లో ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైట్ హౌస్ అంటే కనీసం మర్యాద లేకుండా తన షూ కూడా తొలగించకుండా అతిథులు సేద తీరే సోఫాలో అలా మోకరిల్లి కూర్చోవడంపై మండిపడుతున్నారు. ‘ఓవెల్ ఆఫీసులు కనీసం తన షూ కూడా విప్పకుండా కాన్వే అలా సోఫాలో మోకరిల్లి కూర్చుకోవడం ట్రంప్ టీం పాటించే కనీస గౌరవ మర్యాదల విలువ ఏమిటో తెలియజేస్తోంది’ అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ ఫొటోలో ఎంతోమంది ఉన్నతశ్రేణి నల్లజాతీయులు నిల్చొని ఉండి ట్రంప్‌తో ఫొటో దిగుతున్న సమయంలో కనీసం వారికి గౌరవం కూడా ఇవ్వకుండా అలా నిర్లక్ష్యంగా కూర్చోవడంపై మండిపడుతున్నారు. వేలల్లో కాన్ వే చర్యపై ట్విట్టర్లో ట్వీట్లు పేలాయి.


