థాయ్‌ రాచరికంపై విమర్శలు.. 50 ఏళ్ల జైలు | Thai Court Jails Activist For Record 50 Years Under Royal Insult Law, See Details Inside - Sakshi
Sakshi News home page

Thailand Royal Insult Law: థాయ్‌ రాచరికంపై విమర్శలు.. 50 ఏళ్ల జైలు

Published Sat, Jan 20 2024 5:12 AM | Last Updated on Sat, Jan 20 2024 10:15 AM

Thai court jails activist for record 50 years under royal insult law - Sakshi

బ్యాంకాక్‌: దేశంలోని రాచరిక వ్యవస్థను అగౌరవపరిచిన ఓ వ్యక్తికి థాయ్‌ల్యాండ్‌ కోర్టు రికార్డు స్థాయిలో 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్న థాయ్‌ల్యాండ్‌లో ఇంతటి భారీ శిక్షను విధించడం ఇదే మొదటిసారని హక్కుల సంఘాలు అంటున్నాయి. చియాంగ్‌ రాయ్‌ ప్రావిన్స్‌కు చెందిన మొంగ్‌కొల్‌ తిరఖోట్‌(30) ఆన్‌లైన్‌లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు.

రాజకీయ హక్కుల కార్యకర్త కూడా. రాజు ప్రతిష్టకు భంగం కలిగేలా ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారంటూ 2023లో కోర్టు ఈయనకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 12కు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో గురువారం ఆయనకు మరో 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రపంచంలోనే అత్యంత కఠిన రాజరిక చట్టాలు థాయ్‌ల్యాండ్‌లో అమలవుతున్నాయి. రాజు, రాణి, వారసులను విమర్శిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష ఖాయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement