India's Extrenal Affairs Minister Reacts On Indira Gandhi Disrespecting Event - Sakshi
Sakshi News home page

హత్య ఎక్కడైనా హత్యే.. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి..   

Published Fri, Jun 9 2023 11:22 AM

Indian Extrenal Affairs Reacts On Indira Gandhi Disrespecting Event - Sakshi

న్యూఢిల్లీ: కెనడాలో బ్రాంప్టన్ నగరంలో ఆపరేషన్ బ్లూ జరిగి 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన ఉత్సవాల్లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ఒక శకటంపై ప్రదర్శిస్తూ 5కి.మీ మేర ర్యాలీ చేసి భారతదేశ ప్రతిష్టను మంటగలిపేలా ప్రవర్తించారు. దీనిపై స్పందిస్తూ ఈ హేయమైన చర్యకు పాల్పడినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, రాష్ట్ర వ్యవహారాల మంత్రి మీనాక్షి లేఖి.

పాశవికమైన చర్య.. 
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఒకరిని హత్య చేయడమనేది నేరంగానే పరిగణిస్తారు. ఇలా వేరొకరి హత్యను బట్టి ఆనందిస్తూ సంబరాల్లా జరుపుకోవడం పాశవికం. దీన్ని శాంతిభద్రతల ఉల్లంఘనగా పరిగణించి కెనడా ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.      

ఓటు బ్యాంకు రాజకీయం.. 
అంతకుముందు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ హేయమైన చర్యపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఇటువంటి చర్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలకు మంచిది కాదన్నారు. ఈ సంఘటన వెనుక అంతర్లీనంగా మరో కారణం దాగుంది. ఓటు బ్యాంకు  రాజకీయాలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఎవరైనా ఇలాంటి దారుణానికి ఒడిగడతారా? ఇది వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను ప్రేరేపించేవారి చర్యే. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలకు కెనడా దేశానికి కూడా మంచిది కాదని అన్నారు.   

ఇది కూడా చదవండి: మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే.. 

Advertisement
Advertisement