breaking news
Old building collapsed
-
కేరళలో విషాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన పాత భవనం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. తాజాగా.. త్రిస్సూర్ సమీపంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 27 మంది భవనంలో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇప్పటికే 14 మంది బయటకు తీసుకొచ్చింది. తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. శుక్రవారం ఉదయం కొడకర ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి ముగ్గురు మరణించారు. భవనం పాతదని, అందులో వలస కార్మికులు నివసిస్తున్నారని సమాచారం. మరణించిన ముగ్గురూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులేనని అధికారులు ప్రకటించారు. మృతులు:రాహుల్ (19) – ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిరుపెల్ (21) – మృతదేహంగా వెలికితీశారుఅలీమ్ (30) – శవంగా గుర్తింపుసుమారు 40 ఏళ్ల భవనం కావడం, లాటరైట్ ఇటుకలతో నిర్మించబడడంతో భారీ వర్షాలకు కూలి ఉంటుందని అధికారులు పప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ బిడ్డింగ్ పక్కనే కొడకర పంచాయతీ కార్యాలయం ఉన్నప్పటికీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఫైర్, రెస్క్యూ బృందాలు జేసీబీలు, భారీ యంత్రాలు ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
వరంగల్: మండిబజార్‌లో పాత భవనం కూలి ఇద్దరు మృతి
-
సీతాఫల్మండిలో విషాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సీతాఫల్‌మండిలోని ఓ పురాతన భవనం స్లాబ్ ఆదివారం కూలిపోయింది. ఈ విషాద ఘటనలో తల్లితోపాటు ఆమె 14 నెలల కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ఘటన గురించి తెలియడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పురాతన భవనం కూలిన స్థలాన్ని పరిశీలించారు. -
సదాశివపేటలో కూలిన పురాతన భవనం
సురక్షితంగా బయటపడిన కుటుంబ సభ్యులు తప్పిన ప్రమాదం.. పరిశీలించిన ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి సదాశివపేట: ఎడ తెరిపిలేకుండా కురిసిన వర్షాలకు బాగా తడిసిపోయిన అతి పురాతన భవనం అకస్మాత్తుగా కూలిపోయిన సంఘటన గురువారం పట్టణంలోని గడిమైసమ్మ మందిరం సమీపంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం భవనంలో ఉంటున్న అల్లాదుర్గం సురేశ్, భార్య విశాల, నానమ్మ నాగమణి, ఏడాది వయస్సున్న కుమారుడు ప్రద్వీక్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం పూర్తిగా తడిసిపోయింది. దీంతో గురువారం అకస్మాత్తుగా పగుళ్లు రావడం గమనించిన సురేశ్ వెంటనే తేరుకుని భవనంలో ఉన్న నానమ్మ, నాగమణి, భార్య విశాల, కుమారుడు ప్రద్వీక్లను చాకచక్యంగా తప్పించారు. భవనం ముఖద్వారం పూర్తిగా కూలిపోయింది. దీంతో సురేశ్ మున్సిపల్ కమిషనర్ ఇస్వాక్ ఆబ్ఖాన్కు, తహసీల్దార్ గిరికి భవనం కూలిన విషయమై ఫోన్లో సమాచారం చేరవేశాడు. కమిషనర్ హైదరాబాద్‌లో సమావేశంలో ఉండడంతో మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ మధు, టీపీఓ శ్రీనివాస్, అదనపు టీపీఓ ఝాన్సీలను సంఘటన స్థలానికి పంపించారు. కూలిపోయిన పురాతన భవనంలోని వారిని నిచ్చెన సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ గిరితో కలిసి పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తగిన ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు. పురాతన భవనాల్లో ప్రజలెవరూ నివసించవద్దని ప్రజలకు పిలపునిచ్చారు. అనంతరం కమిషనర్ ఇస్వాక్‌ఆబ్‌ఖాన్ ఆ భవనాన్ని వెంటనే కూల్చివేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించడంతో జేసీబీ సహాయంతో కూల్చివేశారు. -
విజయవాడలో పాతభవనం కూలి ముగ్గురి మృతి
విజయవాడ: విజయవాడలో పాతభవనం కూలి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పాతబస్తీలోని నెహ్రూ బొమ్మ సెంటర్లో పాతభవనంకు మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందినవారిని భావి నారాయణ, చంద్రశేఖర్, మూర్తిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.