వీడియో: తమిళ​ ‘సింగం’.. రౌడీని పట్టుకునేందుకు ఎస్‌ఐ పోరాటం | Tiruvallur SI Ananda Kumar hangs on Speeding car Video Viral | Sakshi
Sakshi News home page

వీడియో: తమిళ​ ‘సింగం’.. రౌడీని పట్టుకునేందుకు ఎస్‌ఐ పోరాటం

Jun 27 2025 11:34 AM | Updated on Jun 27 2025 12:50 PM

Tiruvallur SI Ananda Kumar hangs on Speeding car Video Viral

చెన్నై: తమిళనాడులో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. హీరో సూర్య.. నటించిన సింగం సినిమాలో మాదిరిగా.. రాష్ట్రంలో మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీ షీటర్‌ను పట్టుకునేందుకు ఓ ఎస్‌ఐ.. అదే రేంజ్‌లో ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్‌లో సదరు ఎస్‌ఐ చివరకు విఫలమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన అళగురాజా.. మయిలై శివకుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే అళగురాజాపై ఇప్పటికే పలు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సదరు రౌడీ షీటర్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు. తాజాగా అళగురాజా.. తిరువళ్లూరు జిల్లాలో దాక్కున్నాడని సమాచారం అందడంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో, అతడు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

పోలీసుల రాకను పసిగట్టిన అళగురాజా, అతడి బ్యాచ్‌.. అక్కడి నుంచి పారిపోయింది. వీరంతా ఓ కారులో పారిపోతుండగా వారిని జామ్ బజార్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆనంద కుమార్, పలువురు పోలీసులు వెంటాడారు. ఎస్‌ఐ ఆనంద కుమార్‌.. వాళ్లు ప్రయాణిస్తున్న కారుపైకి దూకారు. తిరువళ్లూరు-తిరుపతి హైవేపై సదరు ఎస్‌ఐ.. కారుకు డోర్‌కు వేలాడుతూ దాదాపు ఒక కిలోమీటర​్‌ వెళ్లారు. కారుతో పాటు ఎస్‌ఐని అళగురాజా ఈడ్చుకెళ్లారు. అనంతరం, కారు లోపల ఉన్న నిందితులు ఎస్‌ఐను తోసివేయడంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. 

అయితే, ఎస్‌ఐ ఆనంద కుమార్‌.. హెల్మెట్‌ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్‌ కారు నుంచి ఎస్‌ఐ కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోసారి రౌడీ షీటర్‌ అళగురాజా.. పోలీసుల నుంచి తప్పించుకుని పరారీ అయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement