breaking news
Tiruvallur
-
తమిళనాడు: రైలు నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. ట్రైన్స్ నిలిపివేత
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తిరువళ్లూరులో డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అన్ని వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో, వ్యాగన్లు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా అప్రమత్తమైన అధికారులు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే, ట్రాక్ సమీపంలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు.వివరాల ప్రకారం.. అరక్కోణం నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైలులో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. పెరియకుప్పం సమీపంలో గూడ్స్ రైలులో మంటలు వ్యాపించాయి. ఓడరేవు నుండి చమురుతో వెళ్తున్న గూడ్స్ రైలు కావడంలో మంటలు చెలరేగుతున్నాయి. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. రైలులో ఇంధనం ఉండటంతో మంటలు మరింత వ్యాపిస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరువళ్ళూరు ఎస్టీ కాలనీ, వరదరాజ నగర్‌కు చెందిన 300 కుటుంబాలను జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి తిరువళ్ళూరు కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ శ్రీనివాస్ పెరుమాళ్, రైల్వే డీఆర్ఎం విశ్వనాథన్ చేరుకున్నారు.🚨 #Breaking: Massive fire engulfs a diesel freight train near Tiruvallur, Tamil Nadu. Several major trains from MGR Chennai Central have been canceled for today, July 13, as a safety precaution. Passengers are advised to check with @GMSRailway for updates.#TrainFire #TamilNadu… pic.twitter.com/1ipJg4q94M— Shubham Rai (@shubhamrai80) July 13, 2025ఇక, గూడ్స్ రైలుకు మొత్తం 52 ట్యాంకర్లు ఉండగా.. ఇంజన్ వైపున రెండో ట్యాంకర్ నుండి తొమ్మిదో ట్యాంకర్ వరకు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది ట్యాంకర్లు అగ్నికి ఆహుతి కాగా.. మిగిలిన ట్యాంకర్లను అధికారులు రైలు నుంచి సురక్షితంగా తప్పించినట్టు సమాచారం. 40 ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్లో 70వేల లీటర్లు క్రూడ్ ఆయిల్ ఉంది.Major fire broke out very near tiruvallur railway station! Oil trail got collapsed n breakup a major fire.. #tiruvallur #tiruvallurrailwaystation #railway #SouthernRailway @RailMinIndia @IRCTCofficial @GMSRailway @UpdatesChennai @THChennai @polimernews pic.twitter.com/YJ8G534hpc— arsath ajmal (@ajmalji) July 13, 2025 A fuel-laden railway tanker caught fire near Tiruvallur.Thick black smoke and intense flames engulfed the area, disrupting train services.Firefighters are on the scene, & officials are investigating the cause.#TrainFire #BreakingNews #ChennaiUpdates @NewIndianXpress@xpresstn pic.twitter.com/Pc3jwtJJDd— Ashwin Prasath (@ashwinacharya05) July 13, 2025 అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు పదికి పైగా అగ్నిమాపక యంత్రాలు ప్రయత్నిస్తున్నాయి. మంటల కారణంగా, అరక్కోణం మీదుగా సెంట్రల్‌కు వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. అదనంగా ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైలును కూడా నిలిపివేశారు. తిరుపతి, వేలూరు, మైసూరు, సేలం నుంచి చెన్నైకు వెళ్ళే రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 🚨 BREAKING: Goods train derails and catches fire near Tiruvallur railway station in Tamil Nadu. Rescue operations currently underway. 🚂🔥#TiruvallurTrainAccident #TamilNadu #TrainDerailment #RescueOperations #Breaking #IndianRailways #Emergency #SafetyFirst pic.twitter.com/NShYM4uw8K— Benefit News 24 (@BenefitNews24) July 13, 2025Southern Railway tweets, "Due to a fire incident near Tiruvallur, overhead power has been switched off as a safety measure. This has led to changes in train operations. Passengers are advised to check the latest updates before travel." pic.twitter.com/LTvTAFYNqu— ANI (@ANI) July 13, 2025 -
వీడియో: తమిళ ‘సింగం’.. రౌడీని పట్టుకునేందుకు ఎస్ఐ పోరాటం
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హీరో సూర్య.. నటించిన సింగం సినిమాలో మాదిరిగా.. రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్‌ను పట్టుకునేందుకు ఓ ఎస్ఐ.. అదే రేంజ్లో ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్లో సదరు ఎస్ఐ చివరకు విఫలమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన అళగురాజా.. మయిలై శివకుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే అళగురాజాపై ఇప్పటికే పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సదరు రౌడీ షీటర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. తాజాగా అళగురాజా.. తిరువళ్లూరు జిల్లాలో దాక్కున్నాడని సమాచారం అందడంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో, అతడు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.పోలీసుల రాకను పసిగట్టిన అళగురాజా, అతడి బ్యాచ్.. అక్కడి నుంచి పారిపోయింది. వీరంతా ఓ కారులో పారిపోతుండగా వారిని జామ్ బజార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద కుమార్, పలువురు పోలీసులు వెంటాడారు. ఎస్ఐ ఆనంద కుమార్.. వాళ్లు ప్రయాణిస్తున్న కారుపైకి దూకారు. తిరువళ్లూరు-తిరుపతి హైవేపై సదరు ఎస్ఐ.. కారుకు డోర్‌కు వేలాడుతూ దాదాపు ఒక కిలోమీటర్ వెళ్లారు. కారుతో పాటు ఎస్ఐని అళగురాజా ఈడ్చుకెళ్లారు. అనంతరం, కారు లోపల ఉన్న నిందితులు ఎస్ఐను తోసివేయడంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. అయితే, ఎస్ఐ ఆనంద కుమార్.. హెల్మెట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ కారు నుంచి ఎస్ఐ కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోసారి రౌడీ షీటర్ అళగురాజా.. పోలీసుల నుంచి తప్పించుకుని పరారీ అయ్యాడు.திருவள்ளுர் அடுத்த திருப்பாச்சூர் பகுதியில் சென்னை ஸ்பெஷல் டீம் போலீசார் முக்கிய வழக்கு ஒன்றில் தொடர்புடைய குற்றவாளியை சினிமாவில் வரும்சண்டைக் காட்சிகளையும் மிஞ்சும் அளவிற்கு துரத்தி சென்றபோது கீழே விழும் காட்சி#Tiruvallur #Chanakyaa pic.twitter.com/x3m4Q7ceJp— சாணக்யா (@ChanakyaaTv) June 26, 2025 -
అమ్మా లే అమ్మా.. ఎందుకిలా చేశావ్ అనుప్రియా..
తిరువళ్లూరు: ప్రిడ్జి నుంచి ఐస్‌క్రీమ్ కిందపడిందన్న కారణంతో అత్త మందలించింది. దీంతో, మనస్తాపానికి గురైన కోడలు.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పుళల్ సమీపంలో జరిగింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని మెండియమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన అశ్విన్‌రాజ్ అదే ప్రాంతానికి చెందిన అనుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండున్నరేళ్ల కిందట వీరిద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న ప్రిడ్జిని అనుప్రియ తెరవగా, అందులో నుంచి ఐస్‌క్రీమ్ కిందపడింది. దీంతో అనుప్రియను ఆమె అత్త చిత్ర మందలించింది.అత్త మందలింపుతో మనస్తాపం చెందిన అనుప్రియ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న వివాహితను కిందకు దింపి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే అనుప్రియ మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పుళల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
అల్లుడిని చేరదీసిన అత్త.. మరదల్ని గర్భవతి చేసి..
తిరువళ్లూరు: తమిళనాడులోని తిరువళ్లూరు పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. భార్య సోదరిని గర్భవతి చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటూ లక్ష రూపాయల జరిమాన విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో, కోర్టు తీర్పు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. చెన్నై ఆండాల్ నగర్‌కు చెందిన బికారీ నాయక్ కుమారుడు రాజ్‌కుమార్ నాయక్ (35). ఇతను అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అత్తారింటిలోనే ఉంటూ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కుమార్ నాయక్.. తన భార్య ఆమె సోదరి ప్రియదర్శిని(17)ని బలవంతంగా పలుమార్లు శారీరకంగా వాడుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రియదర్శిని గర్భవతి కావడంతో బాధితురాలు ఎన్నూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.అనంతరం కేసు విచారణ తిరువళ్లూరు కోర్టులో సాగింది. విచారణలో ప్రియదర్శినిపై బలవంతంగా నిందితుడు పలుమార్లు అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటూ లక్ష రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు మరో మూడు సంవత్సరాల పాటూ అదనంగా శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించిన నేపథ్యంలో నిందితుడిని పుళల్ జైలుకు తరలించారు. -
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఐదుగురు మృతి
తిరుత్తణి: తమిళనాడులోని తిరుత్తణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరుముల్లెవాయల్‌లో భారీ అగ్ని ప్రమాదం
చెన్నై: తిరుముల్లెవాయల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఉద్యోగులు మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ మంటలు భవనాన్ని చుట్టుముట్టాయి. ఫ్యాక్టరీ పక్కన ఉన్న కాలేజీకి మంటలు అంటుకున్నాయి. భయంతో విద్యార్థులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.Tiruvallur, Tamil Nadu: A massive fire broke out at a food manufacturing company in Thirumullaivayal. Despite efforts by employees to control it, the fire quickly spread, engulfing the entire building and causing significant damage to the company and the surrounding area pic.twitter.com/AVlCX588uc— IANS (@ians_india) February 20, 2025 -
Tiruvallur: సహాయక చర్యలు ముమ్మరం
-
విద్యార్థులకు ఫ్రీ హెయిర్ కటింగ్ చేయించిన టీచర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే!
తిరువళ్లూరు(చెన్నై): విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచేందుకు గాను.. ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలోనే విద్యార్థులకు ఉచితంగా హెయిర్ కటింగ్ చేయించారు. తిరువళ్లూరు జిల్లా తిరువూర్‌లో ప్రభుత్వ మోడల్ పాఠశాల ఉంది. ఇక్కడ 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే పాఠశాలకు వచ్చే బాలురల్లో ఎక్కువ మంది స్టైయిల్ కటింగ్‌తో వస్తున్నట్టు ఉపాధ్యాయులు గుర్తించారు. జుట్టు ఎక్కువగా పెంచుకోవడం, వన్‌సైడ్ కటింగ్, పంక్ కటింగ్ పేరుతో తరగతులకు హాజరవుతున్నారు. దీంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ లేదనే భావన స్థానిక ప్రజల్లో ఏర్పడినట్లు తెలుస్తుంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు విద్యార్థుల ప్రవర్తన సైతం ఇబ్బందికరంగా మారింది. దీంల్ స్టైయిల్ కటింగ్ చేసుకున్న100 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠశాలలోనే సాధారణ కటింగ్ చేయించారు. టీచర్లను పలువురు స్థానికులు అభినందించారు. ఇది ఇలా ఉండగా విద్యార్థులకు స్టైయిల్ హెయిర్ కటింగ్‌లు చేయవద్దని కోరుతూ సెలూన్ నిర్వాహకులకు సైతం ఉపాధ్యాయులు కరపత్రాలను పంపిణీ చేయడం గమనార్హం. చదవండి: సున్నం కొడుతుంటే రహస్య గది కనిపించింది.. అందులోకి వెళ్లి చూడగా.. -
ఎంపీనయ్యి ఆరునెలలే... అంతలోనేనా ?
తిరువళ్లూరు : ఎంపీగా గెలిచి ఆరునెలలు కూడా కాకుండానే సమస్యలు పరిష్కరించమంటే ఎలా సాధ్యమవుతుందటూ అర్జీదారులపై తిరువళ్లూరు ఎంపీ జయకుమార్ ఆగ్రహం వెళ్లగక్కారు. దీంతో చేసేదేమీలేక రైల్వే సంఘం నేతలు నిరాశతో వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు బీడీఓ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించే కార్యకమాన్ని మంగళవారం ఉదయం ఎంపీ జయకుమార్, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడంబత్తూరుకు చెందిన 43 గ్రామాల నుంచి 467 మంది వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఎంపీ వినతిపత్రాలు తీసుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న కడంబత్తూరు రైలు ప్రయాణికులసంఘం నేతలు కూడా అక్కడికి వచ్చారు. ఎన్నికల హమీలో భాగంగా కడంబత్తూరు రైల్వేస్టేషన్‌కు అబివృద్ధి నిధులు కేటాయించడంతో పాటు పాస్ట్ ప్యాసింజర్ రైలు కడంబత్తూరులో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తేవాలన్నారు. 'ఇంతమంది ఒకేసారి వచ్చి తమ సమస్యలు పరిష్కరించమంటే ఎలా సాధ్యమవుతుందటూ మండిపడ్డారు. అయినా నేను ఎంపీనయ్యి ఆరు నెలలు కూడా కాలేదు.. కాస్త ఓపిక పట్టండి అంటూ ఎంపీ జయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రయాణికుల సంఘం నేతలు నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చారు. ఎంపీగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ఎన్నో హమీలను గుప్పించారని ప్రజలతో నిత్యం మమేకమవుతాననీ హమీ ఇచ్చి ఇప్పడు ఇలా ప్రవర్తించడం సరికాదనీ వారు ఆసహనం వ్యక్తం చేశారు. వినతిపత్రాలు తీసుకున్న ఎంపీ వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాని వినతిపత్రాలపై ప్రజలకు సమాచారం ఇవ్వాలని, ఎందుకు పరిష్కారం కాలేదో కూడా వివరించాలని సూచించారు. అయితే పరిష్కారం పేరిట భాదితులను తరచూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని ఎంపీ అధికారులను హెచ్చరించడం కొసమెరుపు. -
హైడ్రామా.. టవరెక్కిన ప్రేమికుడు..!
సాక్షి, తిరువళ్లూరు: ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు సెల్‌ఫోన్ టవరెక్కి ఆత్మహత్యా బెదిరింపులకు దిగాడు. మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడని ఆ అమ్మాయిని పోలీసులు తల్లిదండ్రులతో పంపారు. దీంతో ఆ యువకుడు మనస్తాపం చెంది బుధవారం సెల్‌ఫోన్ టవరెక్కాడు. భార్యను తనతో పంపేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని టవరెక్కి బెదిరించడంతో ఉద్రిక్తతకు నెలకొంది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌లోని కొప్పూర్ గ్రామానికి చెందిన మారియప్పన్ కుమారుడు గజేంద్రన్ (21). ఇతను అదే ప్రాంతానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థినిని వారం రోజుల కిందట తిరుమలలో వివాహం చేసుకున్నాడు. ఇలాఉండగా బాలిక అదృశ్యంపై ఫిర్యాదు మేరకు మనవాలనగర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక తిరుమలలో ఉన్నట్టు గుర్తించి మూడు రోజుల క్రితం వారిని తిరువళ్లూరు తీసుకొచ్చారు. అనంతరం బాలిక మైనర్ అని తెలియడంతో కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. టవరెక్కి బెదిరింపులు: మైనర్ కావడంతో రహస్యంగా చేసుకున్న పెళ్లి చెల్లదని పోలీసులు చెప్పి ఇద్దరినీ వారి తల్లిదండ్రుల వద్దకు పంపారు. గజేంద్రన్ సెల్ఫోన్లో ఉన్న పెళ్లి ఫొటోలను తొలగించారు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ బలవంతంగా విడదీశారని యువకుడు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టవరెక్కి ఆత్మహత్యా బెదిరింపులకు దిగాడు. తిరువళ్లూరు అదనపు ఎస్పీ తిలైనటరాజన్, 20 మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చారు. యువకుడితో కింద నుంచే చర్చలు జరిపారు. తన భార్య వచ్చే వరకు కిందకు దిగనని, ఎవరైనా టవర్‌పైకి రావాలని ప్రయత్నిస్తే దూకేస్తానని యువకుడు బెదిరించాడు. మీడియా ముసుగులో వెళ్లిన పోలీసు: మీడియాతో సమస్యను చెప్పుకోవడానికి ఆ యువకుడు అంగీకరించాడు. ఓ కానిస్టేబుల్‌ను మీడియా ప్రతినిధిగా టవర్‌పైకి పంపారు. మళ్లీ అతను మనసు మార్చుకుని భార్యను చూపిస్తే తప్ప దిగనని భీష్మించుకున్నాడు. అప్పటికే టవర్ పైకి వెళ్లిన కానిస్టేబుల్ గజేంద్రన్తో లైవ్‌లో మాట్లాడిస్తానని చెప్పి నమ్మించి దగ్గరికి వెళ్లి పట్టుకున్నాడు. మరికొంత మంది పోలీసులు పైకి వెళ్లి రాత్రి 9 గంటలకు యువకుడిని కిందకు దించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన ఈ హైడ్రామా సుఖాంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
వినాయక మంటపంలో గొంతు కోసుకుని..!
సాక్షి, తిరువళ్లూరు : వినాయకుడి విగ్రహం వద్ద గొంతు కోసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని మనవాలనగర్‌లో కలకలం సృస్టించింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతానికి చెందిన వెంకట్రామన్ కుమారుడు శోభన్‌బాబు(35). ఇతనికి వివాహం కాలేదు. ఎనిమిది నెలల క్రితం వెంకట్రామన్ అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటినుండి మానసికస్థితి సరిగాలేని శోభన్‌బాబు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి పదిగంటల సమయంలో మనవాలనగర్ సిగ్నల్ వద్ద ఉన్న వినాయకుడి విగ్రహం వద్ద తచ్చాడుతూ కనిపించాడు. అనంతరం వినాయక మండపం వద్ద అవసరాల కోసం ఉంచిన బ్లేడుతో ఒక్కసారిగా గొంతు కోసుకున్నాడు. రక్తస్రావం కావడంతో గట్టిగా కేకలు వేస్తూ కింద పడిపోయాడు. స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ల సూచన మేరకు చెన్నైకి తరలించగా అక్కడే చిక్సిత పొందుతూ మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన మనవాలనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వరకట్న వేధింపులకు మహిళ బలి
తిరువళ్లూరు: వరకట్న వేధింపులకు తిరువళ్లూరు సమీపంలో మరో యువతి బలైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా ఒండికుప్పం గ్రామానికి చెందిన దాసన్ కుమార్తె కిరోషిక(22). అదే ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ పళని కుమారుడు విష్ణుకుమార్. ఇద్దరు శ్రీపెరంబదూరులోని ప్రవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తోంది. అనంతరం వీరిద్దరూ 2015 ఆగస్టులో వివాహం జరిగింది. ప్రస్తుతం కిరోషిక వానగరం సమీపంలోని ప్రయివేటు కంపెనీలో పనిచేస్తూ ఉండగా విష్ణుకుమార్ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరువురి కాపురం కొంత కాలం పాటు సజావుగా సాగినా, తరువాత వరకట్న వేధింపులు సాగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో కిరోషిక మృతి చెందినట్టు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కిరోషిక బంధువులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పరిశీలించగా మృతదేహంపై గాయాలు ఉన్నట్టు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కిరోషిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా విష్ణుకుమార్‌ను సైతం అరెస్టు చేశారు. అయితే తమ కుమార్తె వరకట్నం కోసం నిత్యం వేధించే వారని, వరకట్నం తేలేదన్న కోపంతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించిన బంధువులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టుడించి ఆందోళనకు దిగారు. విష్ణుకుమార్ తండ్రి పళని, తల్లి కర్పగంలను అరెస్టు చేసే వరకు మృతదేహాన్ని తీసుకోబోమని నినాదాలు చేశారు. దీంతో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీవో దివ్యశ్రీ మృతురాలి బంధువులతో చర్చలు జరిపారు. నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు. -
కిరోసిన్ పోసుకునీ సూపర్‌మార్కెట్‌కు దూసుకెళ్ళిన మహిళ
- తన కూతురి ఆచూకీ తెలపాలనీ ఆందోళన - అడ్డుకున్న పోలీసులు - ఉద్రిక్తత తిరువళ్లూరు : తిరువళ్లూరులోనీ ప్రవేటు సూపర్మార్కెట్లో పని చేస్తూ గత 15న అదృశ్యమైన యువతి ఆచూకీ తెలపాలనీ కోరుతూ బందువులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. తన కుమార్తేను సూపర్ మార్కెట్ యజమానీ బందువులే కిడ్నాప్ చేసారనీ ఆరోపించిన మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకునీ సూపర్ మార్కెట్ లోపలికి దూసుకెళ్ళడంతో ఒక్క సారీగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు ప్రాంతానీకి చెందిన మునస్వామీ కుమార్తే సంధ్య. పట్టణంలోనీ అలీస్ సూపర్మార్కెట్లో సేల్స్ రంగంలో పని చేస్తూవుంది. ఈ నేపద్యంలో గత 15న ఇంటి నుండి పనికి వెళ్ళిన సంధ్య అప్పటి నుండి అదృశ్యమైయింది. ఈ సంగటనపై సంధ్య తల్లి అరసు సెవ్వాపేట పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే పిర్యాదు ఇచ్చి దాదాపు వారం రోజులు దాటుతున్న యువతి ఆచూకీనీ పోలీసులు కనిపెట్టకపోవడంతో ఆగ్రహించిన బంధువులు అలీస్ సూపర్ మార్కెట్ వద్ద ఆందోనకు దిగారు. సూపర్ మార్కెట్ నిర్వాహకుడి బందువుల అరుణ్ తన కుమార్తేను అపహరించాడనీ ఆరోపించిన అమే తల్లి అరస్ ఒంటిపై కిరోసిన్ పోసుకునీ లోపలికి పరుగులు పెట్టింది. దీంతో ఒక్క సారీగా అక్కడ అరుపులు కేకలు వినిపించింది. తన కుమార్తే అచూకీ తెలిపే వరకు తాము ఆందోళననూ విరమించేదీ లేదనీ తేల్చిచెప్పడంతో పోలీసులు వారినీ సముదాయించే ప్రయత్నం చేసారు. ఈ దశలో పోలీసులకు యువతి బందువుల మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. ఇక లాభం లేదనకున్న పోలీసులు సూపర్‌మార్కెట్ నిర్వాహకులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో సూపర్మార్కెట్లో పని చేసే అరుణ్ అనే యువకుడితో వెళ్ళిపోయినట్టు నిర్దారించారు. రెండు రోజుల్లో యువతినీ అప్పగిస్తామనీ హమీ ఇవ్వడంతో సూపర్‌మార్కెట్ నిర్వాహులు హమీ ఇవ్వడంతో వారు శాతించారు. ఇది ఇలా వుండగా పరారైన సంధ్యకు గత రెండు నెలల క్రితం వేరే యువకుడితో నిశ్చితార్ధం అయినట్టు తెలిసింది. -
వీరరాఘవుని సేవలో గవర్నర్ దంపతులు
తిరువళ్లూరు: తిరువళ్లూరులోని వీరరాఘవస్వామి వారిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. తిరువ ళ్లూరులోని వీరరాఘవస్వామి వారి ఆలయాన్ని గవర్నర్ దంపతులు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం స్వామి వారిని దర్శించుకోవడానికి ఆయన సతీమణితో కలిసి వచ్చారు. గవర్నర్ దంపతులకు ఆలయ నిర్వాహకులు గౌరవ ఏజెంట్ సంపత్, కలెక్టర్ సుందరవల్లి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు వీరరాఘవునితో పాటు కనకవల్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పుష్కరిణికి వెళ్లి పూజలు చేయించారు. ఆలయ అధికారులు గవర్నర్ దంపతులకు ప్రసాదాలను అందజేశారు. తిరువళ్లూరుకు గవర్నర్ రాక సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
195 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్ : తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 195 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్టు తిరువళ్లూరు కలెక్టర్ వీరరాఘవరావు, ఎస్పీ శరవణన్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లాకు వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలతో పట్టణంతో పాటు మనవాలనగర్ ప్రాంతంలో కవాతు నిర్వహించారు. ర్యాలీ ముగింపు సందర్భంగా కలెక్టర్ వీరరాఘవరావు మీడియాతో మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 195 సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించి, వాటిని క్షుణ్ణంగా పర్యవేక్షించడానికి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఆంధ్రా నుంచి ఒక కంపెనీ భద్రతా దళాలను రప్పించామని, అవసరమైతే మరిన్ని బలగాలను రప్పిస్తామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే విధులను నిర్వహిస్తున్న ఎన్నికల స్పెషల్ టీమ్‌తో కలిసి ఆంధ్రా పోలీసులు తనిఖీల్లో పాల్గొంటారని కలెక్టర్ వీరరాఘవరావు వెల్లడించారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినా, ఎన్నికల సమయంలో నగదు, ఇతర వస్తువులు పంపిణీ చేయడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
న్యాయం చేయండి
గర్భసంచి శుద్ధి పేరుతో చేసిన వైద్యం వికటించడంతో వివాహిత మృ తి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతిచెందిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు న్యూకాలనీకి చెందిన యువతి బంధువులు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ వీరరాఘవరావుకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు న్యూకాలనీకి చెందిన మరిసెల్వం నాలుగవ కుమార్త్తె సుజితకు అదే ప్రాం తానికి చెందిన మునీంద్రకు 2012 ఆగష్టులో వివాహం జరిగింది. వారికి సం తానం లేకపోవడంతో తిరువళ్లూరులోని స్త్రీల వైద్య నిపుణురాలు విజయలక్ష్మీ వద్ద చికిత్స చేరుుంచుకున్నారు. పలు చికిత్సలు చేసిన విజయలక్ష్మి గర్భసంచిని శుద్ధి చేయూలని, అందుకు తమ వద్ద సౌకర్యాలు లేవని పేర్కొంటూ ఆవడిలోని గ్రేస్ ఆస్పత్రికి వెళ్లాలని సూచిం చారు. వారు ఆవడిలోని గ్రేస్ మల్టీస్పెషాలిటీ వైద్యశాలలో డాక్టర్ లలిత వద్ద 2014 ఫిబ్రవరి 26 నుంచి చికిత్స చేరుుంచుకున్నారు. కొంతకాలం మం దులు వాడిన తర్వాత పోరూర్‌లోని రామచంద్ర ఆస్పత్రికి వెళ్లాలని లలిత వారికి సూచించారు. దీంతో వారు 2014 మార్చి 10న రామచంద్ర వైద్యశాలకు వెళ్లారు. మూడు రోజులు చికిత్స అనంతరం 13న గర్భసంచి శుద్ధి చేసేం దుకు సుజితను తీసుకెళ్లారు. 14వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు సుజిత మరణించింది. తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని, ముగ్గురు వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని న్యాయం చేయూలని కోరుతూ సోమవారం కలెక్టర్ వీరరాఘవరావుకు వినతి పత్రం సమర్పించారు. అలాగే ఆర్డీవో విచారణ చేపట్టాలని సుజిత తండ్రి మరిసెల్వం కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. -
పట్టపగలే 12 లక్షల నగదు చోరీ
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: పట్టపగలే కారు అద్దాలు పగులగొట్టి *12 లక్షల నగదు చోరీకి పాల్పడిన సంఘటన తిరువళ్లూరులోని అక్షయభవన్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. చెన్నై మొగప్పేర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్ తిరువళ్లూరు సమీపంలోని వేపంబట్టు వద్ద వ్యవసాయం చేస్తున్నాడు. ఇతని భూమిని అమ్మగా వచ్చిన డబ్బును బ్యాంకులో దాచాడు. ఈ నేపథ్యంలో వేపంబట్టు వద్ద *15 లక్షలు విలువ చేసే ప్లాటు అమ్మకానికి రావడంతో బ్యాంకులో దాచిన నగదును శుక్రవారం డ్రా చేశాడు. ఆ నగదును కారులో ఉంచి తన కుమారుడు చంద్రశేఖర్‌తో తిరుపతి-చెన్నై జాతీ య రహదారిలో ఉన్న అక్షయభవన్లో భోజనం కోసం వెళ్లాడు. కారును పార్క్ చేసి లోపలికి వెళ్లి చేతులు కడిగేలోపు హోటల్ ఆవరణలో అక్కడున్న వారు గట్టిగా కేకలు వేశారు. శ్రీనివాసన్ బయటకు వచ్చి చూడగా కారు అద్దాలను హెల్మెట్‌తో పగలగొట్టి కారులో ఉంచిన రూ.12 లక్షల నగదు చోరీకి పాల్పడ్డారు. దీనిని గమనించిన వారు ద్విచక్రవాహనాన్ని వెంబడించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు టౌన్ పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన వారు ఇద్దరు యువకులని, వారు ద్విచక్ర వాహనంలో వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనపై తిరువళ్లూరు పోలీసులు బాధితులు శ్రీనివాసన్, చంద్రశేఖర్ నుంచి ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. -
చెన్నై, తిరువళ్లూరులో విద్యాసంస్థలకు సెలవు
చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరునల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి, దిండుగల్, తేని, విరుదనగర్, తిరుచ్చి, పుదుకోట్టై, నాగపట్నం, తంజావూరు, కోయంబత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, కడలూరుల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. చెన్నై, తిరువళ్లూరులో పాఠశాలలు, కళాశాలకు నేడు సెలవు ప్రకటించారు. రేపటి వరకు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. -
ఉద్రిక్తతకు దారితీసిన కాంట్రాక్టర్ హత్య
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరులో ఓ కాంట్రాక్టర్ హత్య ఉద్రిక్తతకు దారి తీసింది. అతడి మద్దతు దారులు, బంధువులు జీహెచ్ వద్ద వీరంగం సృష్టించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి దిగారు. ఆ దృశ్యాల్ని చిత్రీకరించిన సాక్షి విలేకరి కే వెంకటేశ్వర్లుపై తమ ప్రతాపం చూపించారు. కెమెరా ధ్వంసం చేశారు. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కంకు చెందిన మునుస్వామి కుమారుడు కమలనాథన్(42) రోడ్డు కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో బుధవారం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం చెన్నై ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని అక్కడి వైద్యులు సూచిం చారు. ఆయన చెన్నైకి వెళ్లకుండా ఇంటికి వెళ్లారు. ఈ పరిస్థితులో ప్రత్యర్థులు ఆయనపై దాడి చేసి కాళ్లు, చేతులపై నరికి దారుణంగా హత్య చేశారు. కమలనాథన్ మృతదేహాన్ని గురువారం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. అక్కడికి చేరుకున్న అతడి మద్దతుదారులు, బంధువులు వీరంగం సృష్టించారు. ఆస్పత్రిలో ఉన్న కమలనాథన్‌ను ఎందుకు డిశ్చార్జ్ చేశారంటూ వైద్యులపై జులుం ప్రదర్శించారు. వివాదం ముదరడంతో వారి ఆగ్రహానికి జీహెచ్ గురికావాల్సి వచ్చింది. పరుగులు తీసిన రోగులు కమలనాథన్ మద్దతు దారుల వీరంగం సృష్టించడంతో ఆస్పత్రిలోని రోగులు భయాందోళనతో తలా ఓ దిక్కుకు పరుగులు తీశారు. భయానక వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఐ కన్నన్, ఇన్స్పెక్టర్ హరికృష్ణన్, వెల్లవేడు ఎస్ఐ ఇరుడి కేశవన్, తాలూకా ఎస్ఐ అన్నాదురై అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. కమలనాథన్ వర్గీయులు పోలీసులపై తిరగబడ్డారు. దొరికిన వారిని చితక బాదా రు. అక్కడే ఉండి ఈ దృశ్యాల్ని చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరి వెంకటేశ్వర్లు, మక్కల్ టీవీ విలేకరి గోపీని బంధించి దాడి చేశారు. వారి కెమెరాల్ని ధ్వంసం చేశారు. వెంకటేశ్వర్లుతో పాటు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. విలేకరుల ఆందోళన తమ మీద దాడిని ఖండిస్తూ తిరువళ్లూరులోని విలేకరులు ఎస్పీ రుపేష్కుమార్ మీనా, ఏఎస్పీ సెంథిల్‌కుమార్‌ను కలుసుకున్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని, కెమెరా రికవరీ చేయించాలని డిమాండ్ చేశారు. తన మీద జరిగిన దాడి, కెమెరా ధ్వంసంపై సాక్షి విలేకరి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడ్డ వెంకటేశ్వర్లు, అలాగే ఎస్ఐలు కన్నన్, ఇరుడికేశవన్, అన్నాదురై, ఇన్స్పెక్టర్ హరికృష్ణన్ జీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో అన్నాదురై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన్ను తిరువళ్లురులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
రిజర్వేషన్లలో అక్రమాల కూత
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: దీపావళికి ముందస్తు రిజర్వేషన్‌తో పాటు సాధారణ ప్రయాణికులకు ఇచ్చే టికెట్లలోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్టు రైల్వే విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు గురువారం తిరువళ్లూరులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరువళ్లూరు, అరక్కోణం తదితర రైల్వేస్టేషన్లలో దీపావళి పండుగ కోసం టికెట్ల రిజర్వు చేస్తున్నారు. రెండు నెలలుగా తిరువళ్లూరు నుంచి బెంగళూరు, హైదరాబాదు, కేరళ తదితర ప్రాంతాలకు రిజర్వేషన్లుచేస్తున్నారు. పండుగ దగ్గరపడడంతో ముందస్తు రిజర్వేషన్ల వేగం పుంజుకుంది. తిరువళ్లూరు నుంచి వేర్వేరు ప్రాంతాలకు జోరుగా రిజర్వేషన్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వలన రిజర్వేషన్లు రద్దు చేసుకున్న వారి స్థానంలో రైల్వే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మరొకరికి రిజర్వేషన్ టికెట్లను విక్రయిస్తున్నట్టు సమాచారం అం దింది. దీంతో పాటు సాధారణ టికెట్ల విక్రయాలలోనూ అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కందస్వామి, హనిచంద్రన్తో పాటు ఇతర అధికారులు గురువారం ఉదయం రైల్వేస్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే తిరువళ్లూరు నుంచి ఆరక్కోణం వైపు వెళ్తున్న ప్రయాణికుల వద్ద నకిలీ టికెట్లను అధికారులు గుర్తించారు. వీటిని పరిశీలించగా నకిలీ నంబర్లని తేలింది. అంతేగాక టికెట్లను చేతితో రాసి ఇచ్చినట్టు తెలుసుకున్నారు. అనంతరం అధికారులు దాదాపు రెండు గంటల పాటు కౌంటర్ లోని ఉద్యోగులను విచారించారు. ఈ విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అయితే వాటిని మీడియాకు వివరించడానికి అధికారులు నిరాకరించారు. -
రైలులో వధువుపై లైంగికదాడికి యత్నం
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు నుంచి అరక్కోణానికి వెళుతున్న రైలులో వధువుపై లైంగికదాడికి యత్నించిన ఇద్దరు యువకులకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. వేలూరు జిల్లా అరక్కోణం ప్రాంతానికి చెందిన వ్యవసాయ కూలీ తంగవేలు(27). ఇతనికి అదే ప్రాంతానికి చెందిన షర్మిల(23)తో 15 రోజుల క్రితం వివాహం జరిగింది. మంగళవారం తిరువళ్లూరులోని వీరరాఘవ స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం పట్టణంలోని పోస్టాఫీసు వద్దనున్న బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి 11.30 గంటలకు చెన్నై నుంచి అరక్కోణం వైపు వెళుతున్న రైలు ఎక్కారు. వీరిద్దరూ ఒంటిరిగా వెళుతున్న విషయాన్ని గమనించిన ఇద్దరు యువకులు అదే రైలు పెట్టేలో ఎక్కారు. రైలు తిరువళ్లూరు నుంచి యాగట్టూరు వద్దకు రాగానే రైలులో ఉన్న తంగవేలును చితకబాది షర్మిలను బలవంతంగా రైలులో నుంచి దింపారు. భార్యను కిందకు దింపుతున్న విషయాన్ని గ్రహించిన తంగేవుల వారి వెంబడించారు. రైలు వెళ్లిపోవడంతో షర్మిలను పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లేందకు యత్నించారు. తంగవేలు గట్టిగా కేకలు వేశారు. దీని గమనించిన స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. గామస్తులు వస్తున్న విషయాన్ని గమనించిన యువకులు షర్మిలను వదిలి పెట్టి పరారయ్యారు. అయితే టార్చ్లైట్ల సహా యంతో గ్రామస్తులు నిందితులను పట్టుకుని చితకబాది కడంబత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో యువకులు తిరువళ్లూరు జిల్లా పెరియకుప్పం ప్రాంతానికి చెందిన లారన్స్, సాలమాన్గా గుర్తించి వారిని అరెస్టు చేశారు. రాత్రుళ్లు రైళ్లలో భద్రత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.