'వాజ్పేయి విధానాలకు మోదీ సర్కారు తూట్లు' | Modi government neglecting Vajpayee policies, says APCC chief raghuveera reddy | Sakshi
Sakshi News home page

'వాజ్పేయి విధానాలకు మోదీ సర్కారు తూట్లు'

Jan 28 2015 4:53 PM | Updated on Mar 29 2019 9:00 PM

'వాజ్పేయి విధానాలకు మోదీ సర్కారు తూట్లు' - Sakshi

'వాజ్పేయి విధానాలకు మోదీ సర్కారు తూట్లు'

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విధానానికి మోదీ సర్కారు తూట్లు పొడుస్తోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బుధవారం విమర్శించారు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విధానాలకు మోదీ సర్కారు తూట్లు పొడుస్తోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బుధవారం విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు సామాన్యుడిపై భారం మోపుతున్నాయని రఘువీరారెడ్డి ఆ పార్టీలపై మండిపడ్డారు.

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. మోదీ సర్కారు దొంగచాటుగా మూడు దఫాలుగా పన్నులు పెంచి ప్రజలను దోపిడి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని చంద్రబాబు సర్కారు ప్రశ్నించకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతామనడం అన్యాయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement