పన్నుల విధానాన్ని సమీక్షించాలి: సునీల్‌ మిట్టల్‌ | Sunil Mittal Urges To Review Taxes In Telecom Sector | Sakshi
Sakshi News home page

పన్నుల విధానాన్ని సమీక్షించాలి: సునీల్‌ మిట్టల్‌

Jul 31 2020 9:51 PM | Updated on Jul 31 2020 9:53 PM

Sunil Mittal Urges To Review Taxes In Telecom Sector - Sakshi

ముంబై: దేశీయ టెలికాం రంగం పుంజుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాలను సమీక్షించాలని మొబైల్‌ దిగ్గజం భారతి ఏయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ శుక్రవారం తెలిపారు. టెలికాం రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆయన వెబ్‌ కాన్పరెన్స్‌ సమావేశంలో మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో టెలికాం రంగం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. టెలికాం రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిర్మాత్మకమైన చర్యలు చేపట్టాలని సూచించారు. టెలికాం రంగం మూలధన కొరత తదితర సమస్యలను ఎదుర్కొంటుందని అన్నారు. మరోవైపు టెలికాం రంగాన్ని ఆధునికరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement