శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ తూ యా మైన్. సర్వైవల్ థ్రిల్లర్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ వహించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో . ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం వీక్షించారు. ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ఆయన ఈ సందర్భంగా తు యా మైన్ చిత్రబృందాన్ని అభినందించారు. మణిరత్నం మాట్లాడుతూ.. " ఈ మూవీతో బిజోయ్ నంబియార్ ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకొచ్చారు. ఇది థియేటర్లలో ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం" అని ప్రశంసించారు.
ప్రత్యేక ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు సైతం సినిమాపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు అద్భుతమైన సినిమాగా అభివర్ణించగా.. మరికొందరు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, స్టోరీ టెల్లింగ్ కొత్త అనుభూతి ఇచ్చాయని పేర్కొన్నారు. మణిరత్నం వంటి లెజెండరీ డైరెక్టర్ నుంచి ప్రశంసలు లభించడం సినిమా విజయంపై మరింత ధీమాగా ఉందన్నారు.
కాగా.. ఈ మూవీని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి సంయుక్తంగా నిర్మించారు. యువతను లక్ష్యంగా చేసుకుని.. మునుపెన్నడూ చూడని ఎమోషన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందించారు.


