హార్మూజ్‌లో నౌకపై దాడి | Indian sailor killed as MV Cape Dao ship comes under attack in Gulf of Oman | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌లో నౌకపై దాడి 

Sep 24 2026 6:05 AM | Updated on Sep 24 2026 6:05 AM

Indian sailor killed as MV Cape Dao ship comes under attack in Gulf of Oman

దాడిలో ధ్వంసమైన నౌక, గాయపడిన నావికులు

ఒక భారతీయ నావికుని దుర్మరణం 

రంగంలోకి దిగిన ఒమన్‌ నేవీ బలగాలు 

స్వదేశానికి పయనమైన మిగతా 18 మంది భారతీయులు

మస్కట్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) నుంచి బయల్దేరిన నౌక అనూహ్యంగా హార్మూజ్‌ జలసంధిలో దాడికి గురైంది. ఆంటిక్వా, బార్బూడా జెండాతో యూఏఈ నుంచి 28 మంది నావికా సిబ్బందితో ‘ఎంవీ కేప్‌ దావో’సరకు రవాణా నౌక బయల్దేంది. అయితే సెప్టెంబర్‌ 23వ తేదీన హార్మూజ్‌లో నౌకను రెండు టార్పెడోలు ఢీకొట్టాయి. దీంతో నౌకలో ఇంజిన్‌ గది, ఇతర అవసరాలకు ఉపయోగించే గది ధ్వంసమయ్యాయి. 

ఈ దాడి ఘటనలో నౌకలో విధుల్లో ఉన్న సూరజ్‌ యాదవ్‌ అనే భారతీయ నావికుని తలకు తీవ్ర గాయమైంది. దాడి విషయం తెల్సి సమీపంలోని ఒమన్‌ రాయల్‌ నేవీ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ధ్వంసమైన నౌక నుంచి దాదాపు అందర్నీ తమ నౌకలోకి ఎక్కించి తీరానికి తీసుకొచ్చారు. తీవ్ర గాయంతో సూరజ్‌ చనిపోయాడని ఒమన్‌ రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. 

నౌకలో 19 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘సంబంధిత వర్గాలతో నిరంతరం సంప్రతింపులు జరు పుతున్నాం. 18 మంది నావికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తాం’’అని ఇండియన్‌ ఎంబసీ హామీ ఇచ్చిది. సూరజ్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని వెల్లడించింది. మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసింది. తమలో మరో వ్యక్తి యుద్ధానికి బలయ్యాడని ఫార్వర్డ్‌ సీమెన్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌యూఐ) ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement