ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం | US strikes on Bandar Abbas port kill 12 | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం

Sep 21 2026 4:55 PM | Updated on Sep 21 2026 5:12 PM

US strikes on Bandar Abbas port kill 12

టెహ్రాన్‌: ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది.  దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవుపై అమెరికా పెద్ద ఎత్తున దాడి చేసిందని తెలిపింది. ఈ దాడిలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు ప్రకటించింది. అమెరికా క్షిపణుల అటాక్‌లో 12 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారని పేర్కొంది. అదే విధంగా  760 వరకూ వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయని తెలిపింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

ఇరాన్‌ అధికారి తన ప్రకటనలో "అమెరికా దాడుల్లో  12 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. 420 చేపల వేట నౌకలు (వీటిలో సుమారు 70 సాంప్రదాయ ధోలు, 350 చిన్న పడవలు ఉన్నాయి) 340 వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయి". అని  న్యాయవ్యవస్థ ప్రతినిధి అలీ కజెమీ  ప్రకటన విడుదల చేశారు. అయితే దీనిని అమెరికా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

అయితే  ఈ దాడులు ఎప్పుడు జరిగాయి, బాధ్యులను గానీ కజెమీ స్పష్టం చేయలేదు. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం విచక్షణ, అనుపాతం, ముందుజాగ్రత్త వంటి సూత్రాలను దాడి చేసినవారు ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారులు  ఫిర్యాదులను నమోదు చేసుకుంటున్నారని,  దాదాపు 300 నౌకల నష్ట వివరాల అంచనా  పూర్తయ్యిందని పేర్కొన్నారు.

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

కాగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా తమ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది." ఏ కారణంతోనూ ఇరాన్‌కు వెళ్లొద్దు. అక్కడున్న అమెరికా పౌరులు ఇప్పుడే ఇరాన్‌ నుంచి బయిటకు వచ్చేయండీ" అని ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు సంక్షిష్టంగా మారుతున్నాయని హెచ్చరించింది.

అదే విధంగా అక్కడి నిరసనలకు, భారీ జన సమూహాలకు దూరంగా ఉండాలని అమెరికాతో బహిరంగంగా అనుబంధం ఉన్న ప్రాంతాలలో తక్కువ ప్రొఫైల్‌ పాటించాలని పేర్కొంది. వైమానిక దాడులు జరిగితే కిటీకీలు, అద్దాలు తలుపులకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో అమెరికా మరోసారి ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులకు తెగబడుతుందా అనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement