దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 271 పాయింట్లు క్షీణించి 22,869 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 871 పాయింట్ల నష్టంతో 73,024 వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు పెరగడం, చాలా గ్లోబల్ ఈక్విటీలు క్షీణించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ప్రతికూలంగా ట్రేడ్ అవుతున్నాయి.
హిందాల్కో ఇండస్ట్రీస్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇనిస్టిట్యూట్, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.62 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.61 శాతం నష్టపోయాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ ఐటీ తక్కువ క్షీణితతో మెరుగనిపించింది.
- అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.04
- బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 104.32 డాలర్లు
- యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 5.17% వద్దకు చేరాయి.
- గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.51% లాభపడింది.
- నాస్‌డాక్ 0.48% పెరిగింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


