‘సెల్ఫ్‌–లిస్టింగ్‌’ ఆచరణ సాధ్యమే | NSE open to self-listing if SEBI permits, says NSE Chairperson Srinivas Injeti | Sakshi
Sakshi News home page

‘సెల్ఫ్‌–లిస్టింగ్‌’ ఆచరణ సాధ్యమే

Sep 26 2026 5:21 AM | Updated on Sep 26 2026 5:21 AM

NSE open to self-listing if SEBI permits, says NSE Chairperson Srinivas Injeti

అనుమతులపై నిర్ణయం సెబీదే... 

భవిష్యత్తులో సాకారమయ్యే చాన్స్‌

ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌ శ్రీనివాస్‌ ఇంజేటి

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్సే్చంజీలు తమ సొంత ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌పైనే షేర్లను లిస్ట్‌ చేసుకునే ‘సెల్ఫ్‌–లిస్టింగ్‌’ విధానం ఆచరణ సాధ్యమేనని, అయితే దీనికి అనుమతి ఇవ్వాలా..? వద్దా..? అనేది మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ పరిధిలోని అంశమని నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) చైర్మన్‌ శ్రీనివాస్‌ ఇంజేటి అన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టాక్‌ ఎక్సే్చంజ్‌ అయిన ఎన్‌ఎస్‌ఈ.. ప్రత్యర్థి బీఎస్‌ఈలో లిస్టయిన మరుసటి రోజే ఆయన సెల్ఫ్‌–లిస్టింగ్‌ అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఏ స్టాక్‌ ఎక్సే్చంజీ కూడా తన సొంత ప్లాట్‌ఫామ్‌పై తన షేర్లను లిస్ట్‌ చేయడం, వాటి ట్రేడింగ్‌కు అనుమతించడం వీలుకాదు. ఈ నిబంధనలకు అనుగుణంగానే ఎన్‌ఎస్‌ఈ షేర్లు బీఎస్‌ఈలో, బీఎస్‌ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ అయ్యాయి. 

సెబీదే తుది నిర్ణయం  
‘సెల్ఫ్‌–లిస్టింగ్‌కు ఈరోజు అనుమతి లేకపోవచ్చు. కానీ మారుతున్న నిబంధనల నేపథ్యంలో రేపు అనుమతి లభించవచ్చు. ఇది పూర్తిగా ఆచరణ సాధ్యమైన అంశమే. అయితే అనుమతించాలా వద్దా అనేది సెబీ విచక్షణాధికారం. నియంత్రణ సంస్థ సంతృప్తి చెందేలా ఎన్‌ఎస్‌ఈ అవసరమైన ప్రమాణాలను పాటించగలిగితే.. సెల్ఫ్‌–లిస్టింగ్‌ భవిష్యత్తులో వాస్తవం కావచ్చు’ అని ఇంజేటి మీడియా సమావేశంలో అన్నారు.

ప్రజా ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత 
‘లిస్టింగ్‌ తర్వాత ఎన్‌ఎస్‌ఈకి మార్కెట్‌ నియంత్రణ, మార్కెట్‌ సమగ్రతను కాపాడటం, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడం ఒకవైపు.. వాటాదారులకు రాబడులు అందించే వ్యాపార బాధ్యత మరోవైపు ఉంటాయి’ అని ఇంజేటి అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement