దేశీయంగా ఏరో ఇంజిన్‌ టెస్టింగ్‌ | Tata Projects with Canada MDS Aero to build aero-engine testing capacity | Sakshi
Sakshi News home page

దేశీయంగా ఏరో ఇంజిన్‌ టెస్టింగ్‌

Sep 29 2026 4:56 AM | Updated on Sep 29 2026 4:56 AM

Tata Projects with Canada MDS Aero to build aero-engine testing capacity

కెనడియన్‌ ఎండీఎస్‌తో టాటా ప్రాజెక్ట్స్‌ జట్టు

న్యూఢిల్లీ: దేశీయంగా ఆధునిక ఏరో ఇంజిన్‌ టెస్టింగ్‌ మౌలిక సదుపాయాల కల్పనకు దేశీ దిగ్గజం టాటా ప్రాజెక్ట్స్‌ తాజాగా కెనడియన్‌ కంపెనీ ఎండీఎస్‌ ఏరో సపోర్ట్‌ కార్పొరేషన్‌తో చేతులు కలిపింది. ఇందుకు రెండు సంస్థలు భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు టాటా ప్రాజెక్ట్స్‌ వెల్లడించింది. తద్వారా కంపెనీకున్న అడ్వాన్స్‌డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సామర్థ్యాలకు గ్యాస్‌ టర్బయిన్‌ ఇంజిన్‌ టెస్టింగ్‌లో ఎండీఎస్‌ ఏరో సపోర్ట్‌కున్న గ్లోబల్‌ నైపుణ్యాలు జత కలవనున్నట్లు పేర్కొంది. 

వెరసి దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న ఏరోస్పేస్, ప్రపుల్షన్‌ ఎకోసిస్టమ్‌కు మద్దతుగా అవసరమైన అడ్వాన్స్‌డ్‌ టెస్టింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. భాగస్వామ్యంలో భాగంగా టాటా ప్రాజెక్ట్స్‌.. కీలక సివిల్, స్ట్రక్చరల్‌ పనులతోపాటు ఎంఈపీ, హైఎయిర్‌ ప్రెజర్‌ సిస్టమ్స్, హెచ్‌వీఏసీ, హైటెంపరేచర్‌ ఎగ్జాస్ట్‌ సిస్టమ్స్, కూలింగ్‌ వాటర్‌ సిస్టమ్స్‌తోకూడిన ఇన్‌ఫ్రా సంబంధ సౌకర్యాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. మరోపక్క ఎండీఎస్‌ డిజైన్, ఇంజినీరింగ్, సప్లై, ఇంటిగ్రేషన్‌సహా అడ్వాన్స్‌డ్‌ గ్యాస్‌ టర్బయిన్‌ ఇంజిన్‌ టెస్ట్‌ సౌకర్యాలు, సిస్టమ్స్‌లో ప్రత్యేక నైపుణ్యాలను అందజేయనున్నట్లు వెల్లడించింది.  

తదుపరి దశలోకి.. 
దేశీ ఏరోస్పేస్‌ ఎకోసిస్టమ్‌ తదుపరి దశలోకి ప్రవేశిస్తున్నట్లు టాటా ప్రాజెక్ట్స్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ గ్రోత్, స్ట్రాటజీ ఆఫీసర్‌ రాజీవ్‌ మీనన్‌ పేర్కొన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ, ప్రపుల్షన్, టెస్టింగ్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీస్‌ తదితరాలు లక్ష్యంగా అభివృద్ధి చెందుతున్నట్లు వ్యాఖ్యానించారు. రెండు సంస్థల కలయిక ద్వారా స్థానికంగా పటిష్ట ఎగ్జిక్యూషన్, గ్లోబల్‌ ఇంజిన్‌ టెస్టింగ్‌ నైపుణ్యాలతో దేశీయంగా వృద్ధిలో ఉన్న ఏరోస్పేస్‌ రంగానికి మద్దతివ్వనున్నట్లు ఎండీఎస్‌ ఏరో సపోర్ట్‌ చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ జో హజార్‌ తెలియజేశారు. అంతేకాకుండా ఏరోస్పేస్, టెక్నాలజీ విభాగాలలో కెనడా, ఇండియా మధ్య పటిష్టతకు వీలు చిక్కనున్నట్లు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement