రెనాల్ట్ ఇండియా ఎట్టకేలకు తన ట్రైబర్ కారును టర్బో-పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో అప్డేట్ చేసింది. ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ అనే మూడు వేరియంట్లలో లభించే ఎంపీవీ ప్రారంభ ధర రూ.7.84 లక్షలు (ఎక్స్ షోరూమ్).
కొత్త రెనాల్ట్ ట్రైబర్ టర్బోలో 1.0-లీటర్, మూడు-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇంజిన్ 99 హార్స్ పవర్, 180 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 21 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.
కొత్త ఇంజన్‌తో పాటు, రెనాల్ట్ వాహనం లోపల కూడా మార్పులు చేసింది. ఈ మోడల్‌లో అప్డేటెడ్ సస్పెన్షన్ ట్యూనింగ్, యాంటీ-రోల్ బార్‌లు, కొత్త థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, మెరుగైన బ్రేకింగ్, ఏబీఎస్, టీసీఎస్, వీడీసీ కంట్రోల్స్ కోసం సెట్టింగ్‌లు ఉన్నాయి. తక్కువ ధరలో ఫ్యామిలీ కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
ఇదీ చదవండి: పిల్లలు, వృద్ధుల భద్రత కోసం జియోషీల్డ్


