ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ కావడానికి సిద్ధమైంది. కంపెనీ కొత్త కారు ధరలను త్వరలోనే వెల్లడించనుంది. ఇది తొలిసారి టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ డెలివరీ చేయనుంది.
రెనాల్ట్ ట్రైబర్ 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా 99 bhp పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ పొందవచ్చు. ఇదే ఇంజన్‌ను కైగర్, డస్టర్ బేస్ వేరియంట్లలో అందిస్తున్నారు. కాబట్టి పనితీరు బాగుంటుందని తెలుస్తోంది.
ట్రైబర్ టర్బో కారు ఫీచర్స్ పరంగా, పరిమాణం పరంగా ఎలాంటి మార్పులు పొందలేదని సమాచారం. మంచి డిజైన్ కలిగిన ట్రైబర్ ధర కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కిగర్‌లోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ మధ్య ధరల వ్యత్యాసం దాదాపు లక్ష రూపాయల వరకు ఉంది కాబట్టి.
ఇదీ చదవండి: సరికొత్త టాటా ఏరిస్ వచ్చేసింది!


