ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేస్తున్నారా.. RBI కొత్త రూల్స్ తెలుసా? | RBI New Bulk Deposit Rules To Kick in From October 1 Know Changes | Sakshi
Sakshi News home page

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేస్తున్నారా.. RBI కొత్త రూల్స్ తెలుసా?

Sep 28 2026 8:16 PM | Updated on Sep 28 2026 8:33 PM

RBI New Bulk Deposit Rules To Kick in From October 1 Know Changes

బ్యాంకుల్లో డబ్బు దాచుకునే ఖాతాదారులకు.. వడ్డీ రేట్లు చాలా ముఖ్యం. ఎందుకంటే ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి కోరుకునేవారికి ఫిక్స్‌డ్ డిపాజిడ్ ఉత్తమమైన మార్గం. పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసే వారికి ఏ వడ్డీ రేటు లభిస్తుందో ముందుగానే తెలుసుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా అవసరం. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇవి 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

వెబ్‌సైట్‌లో వడ్డీ రేట్లు
కొత్త నిబంధనల ప్రకారం.. బ్యాంకులు తమ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను ముందుగానే తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించాలి. ముఖ్యంగా.. బల్క్ డిపాజిట్లు చేసే ఖాతాదారులకు వర్తించే వడ్డీ రేట్ల విషయంలో పారదర్శకత ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఈ మార్పులు చేసింది.

బల్క్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేట్లను బ్యాంకులు పనిరోజుల్లో.. ఉదయం 10 గంటలకు తమ వెబ్‌సైట్‌లో వెల్లడించాలి. దీనికి 10 నిమిషాల గడువు కూడా ఉంటుంది. అంటే గరిష్టంగా ఉదయం 10:10 గంటలలోపు ఆ రోజు వర్తించే రేట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండాలి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బ్యాంకులు ఒకే రకమైన డిపాజిట్లకు వేర్వేరు వడ్డీ రేట్లు ఇష్టానుసారం ఇవ్వడానికి వీల్లేదు. ఒకే రోజున, ఒకే మొత్తానికి సంబంధించిన డిపాజిట్ల విషయంలో శాఖలు, ఖాతాదారుల మధ్య అనవసరమైన తేడా చూపకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అంటే.. బ్యాంకు ప్రకటించిన రేట్లు, ఖాతాదారులకు వాస్తవంగా అందించే రేట్లు ఒకేలా ఉండాలి.

బల్క్ డిపాజిట్ల విషయంలో..
అయితే.. కొన్ని అర్హత ఉన్న బల్క్ డిపాజిట్ల విషయంలో బ్యాంకులకు వడ్డీ రేట్లను నిర్ణయించడంలో కొంత వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా వివిధ రకాల డిపాజిటర్లకు వర్తించే లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) ఆధారంగా.. వడ్డీ రేట్లలో తేడాలు ఉండే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న నాన్ రెసిడెంట్ రూపాయి డిపాజిట్లకు కూడా వర్తించే సందర్భాల్లో ఈ సౌలభ్యం ఉంటుంది.

అయితే.. రూ.3 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లకు మాత్రం LCR ఆధారంగా వేర్వేరు వడ్డీ రేట్లు నిర్ణయించే అవకాశం బ్యాంకులకు ఇవ్వలేదు. చిన్న మొత్తాల డిపాజిట్లకు కూడా.. ఇలా వేర్వేరు రేట్లు అనుమతిస్తే వడ్డీ రేట్ల నిర్ణయం మరింత క్లిష్టంగా, వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడే అవకాశం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది.

ఇదీ చదవండి: ఆ ఒక్క రోజు UPI చెల్లింపులు బంద్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement