హైదరాబాద్: కాక్‌పిట్, ఇంటర్‌ఫేస్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారు చేసే ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ భారత్‌లో తొలి తయారీ కేంద్రాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ఉన్న జీఎంఆర్ ఏవియేషన్ సెజ్‌లో ప్రారంభించింది.
ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో దిగ్గజంగా పేరుగాంచిన ఫిరాన్ టెక్నాలజీ (Firan Technology Group).. భారత్‌లో తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం దేశీయ ఏరోస్పేస్ రంగంలో మరో మైలురాయి అని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు ల్యాండ్ డెవలప్‌మెంట్ సీఈఓ అమన్‌కపూర్ అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలన్నీ తమ సెజ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
చదవండి: తెలుగు రాష్ట్రాల్లోకి గోద్రెజ్ నింజా


