తెలుగు రాష్ట్రాల్లోకి గోద్రెజ్‌ నింజా | Godrej Pet Care Manufactures Food Products For Pet Dogs | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లోకి గోద్రెజ్‌ నింజా

Jun 30 2026 9:51 AM | Updated on Jun 30 2026 10:32 AM

Godrej Pet Care Manufactures Food Products For Pet Dogs

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గోద్రెజ్‌ పెట్‌ కేర్‌ (జీపీసీ) సంస్థ పెంపుడు శునకాల కోసం ఉద్దేశించిన ఆహారోత్పత్తి గోద్రెజ్‌ నింజాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. శునకాల జీర్ణకోశం ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీవోవో నితిన్‌ జైన్‌ తెలిపారు. దీని ధర రూ. 20 నుంచి ప్రారంభమవుతుంది.

ఇప్పటికే తమిళనాడులో దీన్ని ప్రవేశపెట్టినట్లు, తెలుగు రాష్ట్రాల తదుపరి ఇతర మార్కెట్లలోకి కూడా విస్తరించనున్నట్లు జైన్‌ చెప్పారు. త్వరలో ఇతరత్రా పెంపుడు జంతువుల ఆహారోత్పత్తులను కూడా ప్రవేశపెడతామన్నారు. నాసిక్‌లో 35,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో తయారీ ప్లాంటు సిద్ధమవుతోందని ఆయన వివరించారు. పెట్‌ కేర్‌ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో విస్తరణపై దాదాపు రూ. 500 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు జైన్‌ చెప్పారు. దేశీయంగా పెట్‌ ఫుడ్‌ విభాగం దాదాపు రూ. 5,000 కోట్లు కాగా, దక్షిణాది వాటా రూ. 2,000 కోట్లుగా ఉంటుందన్నారు. కర్ణాటక వాటా 15%గా, తెలుగు రాష్ట్రాల వాటా 8 శాతంగా ఉందని జైన్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement