ఐపీవో బూమ్‌తో కొత్త రికార్డులు | India primary markets in 84 companies already approved by SEBI | Sakshi
Sakshi News home page

ఐపీవో బూమ్‌తో కొత్త రికార్డులు

Sep 29 2026 5:09 AM | Updated on Sep 29 2026 5:09 AM

India primary markets in 84 companies already approved by SEBI


2026లో రూ. 3.86 లక్షల కోట్ల సమీకరణ అంచనా

ఇప్పటికే 84 ఇష్యూల ద్వారా రూ. 1.1 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత కేలండర్‌ ఏడాది(2026) ప్రైమరీ మార్కెట్లలో నెలకొన్న బూమ్‌ సరికొత్త రికార్డులకు తెరతీయనుంది. ఈ ఏడాది ఇప్పటికే ఐపీవోలు చేపట్టిన 84 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.10 లక్షల కోట్లను సమీకరించాయి. ఈ బాటలో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి క్యూకడుతున్న కంపెనీలు, ఇప్పటికే అనుమతులు పొందిన ఇష్యూలతో చూస్తే ఈ ఏడాది రూ. 3.86 లక్షల కోట్ల సమీకరణకు వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌(ఏఐబీఐ) పేర్కొంది. 

వెరసి ఇప్పటివరకూ సమకూర్చుకున్న నిధులతో పోలిస్తే 3.5 రెట్లకు పెట్టుబడుల సమీకరణ జంప్‌ చేయనున్నట్లు తెలియజేసింది. సెబీ నుంచి ఇప్పటికే అనుమతుల పొందిన సంస్థలు సంఖ్య 130కు చేరగా.. మరో 75 కంపెనీలు దరఖాస్తు చేసిన జాబితాలో చేరినట్లు మధ్యకాలానికి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 

సెబీ నుంచి అనుమతి పొందిన కంపెనీలు ఉమ్మడిగా రూ. 2.43 లక్షల కోట్ల సమీకరణపై కన్నేయగా.. అనుమతుల కోసం వేచిచూస్తున్న సంస్థలు మరో రూ. 1.44 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు ఏఐబీఐ చైర్మన్‌ మహావీర్‌ లునావట్‌ తెలియజేశారు. ఇండియా క్యాపిటల్‌ మార్కెట్స్‌: రాజకీయ భౌగోళిక పరిస్థితులు, క్యాపిటల్‌ అండ్‌ గ్రోత్‌ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఐపీవో సైకిల్‌ను మించి మరింత లోతైన, నిలకడైన మూలధన ఏర్పాటు వ్యవస్థవైపు మళ్లుతున్నట్లు వ్యాఖ్యానించారు. 

ఇదీ జోరు తీరు.. 
గత దశాబ్ద కాలం(2016–2026)లో మెయిన్‌బోర్డ్‌ ఐపీవోల ద్వారా ఇప్పటివరకూ కంపెనీలు ఉమ్మడిగా రూ. 8.36 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. వెరసి వార్షికంగా 2016లో నమోదైన రూ. 26,494 కోట్ల నిధుల సమీకరణ 2025కల్లా రూ. 1.76 లక్షల కోట్లకు ఎగసింది. ఈ ఏడాది(2026) ఇప్పటివరకూ 84 మెయిన్‌బోర్డ్‌ కంపెనీలు రూ. 1.10 లక్షల కోట్లు అందుకున్నాయి. 2016లో 26 కంపెనీలు లిస్ట్‌కాగా.. 2025కల్లా 103కు ఎగశాయి. 

సంస్థాగత ఇన్వెస్టర్లు, సంపన్న వర్గాలుసహా రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి చూపుతుండటంతో ప్రైమరీ మార్కెట్లు మూలధన ఏర్పాటుకు వాహకంగా మారినట్లు లునావట్‌ పేర్కొన్నారు. కాగా.. ఎస్‌ఎంఈ విభాగం సైతం 2025లో 267 ఇష్యూలకు నెలవుకాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ 156 కంపెనీలు ఐపీవోలు చేపట్టినట్లు నివేదిక తెలియజేసింది. దీంతో ఎస్‌ఎంఈ విభాగం 2016–2026 కాలంలో రూ. 39,849 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకుంది.

 సగటు ఎస్‌ఎంఈ ఇష్యూ పరిమాణం రూ. 2016లో రూ. 8 కోట్లుకాగా.. 2026కల్లా రూ. 45 కోట్లకు జంప్‌ చేయడం గమనార్హం! ఈ నేపథ్యంలో రిజిస్టర్డ్‌ మర్చంట్‌ బ్యాంకర్ల సంఖ్య సైతం 2016లో నమోదైన 188 నుంచి 2026 సెప్టెంబర్‌కల్లా 250కు ఎగసింది. 33 శాతం వార్షిక పురోగతి ఇది! ఇక ఐపీవోల సబ్‌్రస్కిప్షన్‌ తీరు చూస్తే 2026లో క్విబ్‌ విభాగంలో సగటున 49 రెట్లు, హెచ్‌ఎన్‌ఐల నుంచి 86 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 26 రెట్లు చొప్పున అధిక స్పందన నమోదవుతున్నట్లు ఏఐబీఐ నివేదిక వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement