ఏప్రిలియా SXR GT: ధర, వివరాలు ఇలా.. | Aprilia SXR GT 125 175 Launched In India | Sakshi
Sakshi News home page

ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ జీటీ: ధర, వివరాలు ఇలా..

Oct 4 2026 1:27 PM | Updated on Oct 4 2026 1:52 PM

Aprilia SXR GT 125 175 Launched In India

ఏప్రిలియా భారతదేశంలో ఎస్ఎక్స్ఆర్ జీటీ శ్రేణిని ప్రవేశపెట్టింది. ఇవి అప్డేటెడ్ ఇంజన్లు, పెద్ద వీల్స్ పొందుతాయి. ఈ కొత్త లైనప్‌లో రూ.1.11 లక్షల ధర గల ఎస్ఎక్స్ఆర్ జీటీ 125, రూ.1.31 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర గల ఎస్ఎక్స్ఆర్ జీటీ 175 ఉన్నాయి.

మే నెలలో ఎస్ఎక్స్ఆర్ 125, ఎస్ఎక్స్ఆర్ 160 మోడళ్లను నిలిపివేసిన తర్వాత వీటి లాంచ్ జరిగింది. పూర్తిగా కొత్త స్కూటర్‌ను పరిచయం చేయడానికి బదులుగా.. ఏప్రిలియా ఇప్పటికే SR 125, SR 175 మోడళ్లలో ఉపయోగిస్తున్న కొత్త ఇంజిన్‌ల ఆధారంగా ఎస్ఎక్స్ఆర్ రూపొందించింది. పెద్ద ఫ్రంట్ ఏప్రాన్, వెడల్పాటి సీటు, మ్యాక్సీ-స్కూటర్ నిష్పత్తులతో స్టైలింగ్ ఆకట్టుకుంటోంది.

ఎస్ఎక్స్ఆర్ జీటీ 125 స్కూటర్ 124.5 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ ద్వారా 7,400 rpm వద్ద 10.6 హార్స్ పవర్.. 6,200 rpm వద్ద 10.4 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. మరింత శక్తివంతమైన ఎస్ఎక్స్ఆర్ జీటీ 175, 174.7 సీసీ, ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 7,200 rpm వద్ద 13.3 హార్స్ పవర్.. 6,000 rpm వద్ద 14.1 Nm టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు BS6 OBD-II స్టేజ్ B అవసరాలకు అనుగుణంగా ఉంటాయి, E20 పెట్రోల్‌కు అనుకూలంగా ఉంటాయి.

రెండు వేరియంట్లలోనూ 14 ఇంచెస్ వీల్స్ అమర్చారు. SXR GT 175లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 5 ఇంచెస్ TFT డిస్‌ప్లే ఉంటుంది, దీని ద్వారా కాల్, మ్యూజిక్ కంట్రోల్స్‌తో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు. దీనికి అదనంగా హ్యాండిల్‌బార్ కంట్రోల్స్, సింగిల్-ఛానల్ ఏబీఎస్, హీట్ షీల్డ్‌తో కూడిన ఎగ్జాస్ట్ ఎండ్ పైప్ కూడా లభిస్తాయి. SXR GT 125, 5-అంగుళాల LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ పొందుతుంది. ఏబీఎస్ స్థానంలో.. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)పై ఆధారపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement