‘జెడ్9 జీటీ’, ‘డీ9’ పేరుతో రెండు కార్ల ఆవిష్కరణ
ప్రారంభ ధరలు రూ.90 లక్షలు, రూ.1.56 కోట్లు
చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడీ తన లగ్జరీ ఎంపీవీ ‘డెంజా’ను శుక్రవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. డెంజా ‘జెడ్9 జీటీ’, ‘డీ9’ పేర్లతో రెండు కార్లను ఆవిష్కరించింది. ప్రారంభ ధరలను వరుసగా రూ.90 లక్షలు, రూ.1.56 కోట్లుగా నిర్ణయించింది.
అంతర్జాతీయ విస్తరణ ప్రయాణంలో భారత మార్కెట్ అత్యంత కీలకమైన మైలురాయి అని డెంజా పేర్కొంది. లగ్జరీ వాహన వినియోగదారుల అభిరుచులు పర్సనలైజేషన్, అత్యాధునిక టెక్నాలజీ, విభిన్నమైన డ్రైవింగ్ అనుభూతుల వైపు మారుతున్న తరుణంలో రెండు ప్రత్యేక మోడళ్లతో అడుగుపెడుతున్నట్లు తెలిపింది.
ఇందులో ‘జెడ్9 జీటీ’ మోడల్ పనితీరు, డిజైన్, డ్రైవింగ్ ఆవిష్కరణలకు ప్రాధాన్యతనివ్వగా.. ‘డీ9’ మోడల్ ప్రయాణికుల సౌకర్యం, విశాలమైన స్థలం (స్పేస్), సులభతర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందని వివరించింది.
భారత్‌లో డెంజాను ఒక అ్రల్టా–లగ్జరీ బ్రాండ్‌గా తీర్చిదిద్దడానికి తాము కట్టుబడి ఉన్నామని బీవైడీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ చౌహాన్ తెలిపారు. కాగా, బీవైడీ అనుబంధ సంస్థకు భారత్‌లో తమిళనాడులో రెండు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో కంపెనీ ఇప్పటివరకు 200 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.


