సీఎం ప్రారంభించిన కారు.. 711 కిమీ రేంజ్! | Devendra Fadnavis Launches Mercedes Benz Electric GLC SUV | Sakshi
Sakshi News home page

సీఎం ప్రారంభించిన కారు.. 711 కిమీ రేంజ్!

Nov 5 2026 7:08 AM | Updated on Nov 5 2026 7:11 AM

Devendra Fadnavis Launches Mercedes Benz Electric GLC SUV

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ.. మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని పుణె సమీపంలోని చకన్ ప్లాంట్‌లో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జీఎల్‌సీ ఉత్పత్తిని ప్రారంభించింది.

ఈ ఎలక్ట్రిక్ జీఎల్‌సీ ప్రత్యేకత ఏమిటంటే.. మెర్సిడెస్ బెంజ్ కొత్త తరం ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్‌ఫామ్ అయిన MB.EA-M ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారైన మొదటి స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న మోడల్ ఇదే. దీనిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రూ.200 కోట్ల పెట్టుబడి
2026లో భారతదేశంలో తమ తయారీ కార్యకలాపాలు, డిజిటలైజేషన్, కొత్త ఉత్పత్తుల కోసం అదనంగా రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో భారత్‌లో సంస్థ మొత్తం పెట్టుబడులు రూ.3,200 కోట్లకు చేరాయి.

ఈ కొత్త ఎలక్ట్రిక్ జీఎల్‌సీలో 94 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించారు. కాబట్టి ఇది 489 హార్స్ పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎస్‌యూవీ కేవలం 4.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 711 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.

ప్రత్యేకమైన టెక్నాలజీ
టెక్నాలజీ పరంగా కూడా ఈ కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. భారతదేశంలో MB.OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న మొదటి మెర్సిడెస్ ఎస్‌యూవీ ఇదే. ఇందులో 39.1 అంగుళాల హైపర్ స్క్రీన్, 942 లైట్ పిక్సెల్స్‌తో కూడిన ఇల్యూమినేటెడ్ గ్రిల్, స్కై కంట్రోల్ పనోరమిక్ రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: దీపావళి గిఫ్ట్‌.. ఉద్యోగులకు ఐఫోన్స్

ధర విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ జీఎల్‌సీ 400 4మాటిక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.78.5 లక్షలుగా నిర్ణయించారు. కాగా ఈ కారు కోసం కంపెనీ రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన 36 గంటల్లోనే.. 550కు పైగా ఆర్దార్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. డెలివరీలు 2026 నవంబర్ మధ్య నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement