హ్యుందాయ్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే? | Hyundai Bayon Launched in India at Rs 9 99 Lakh | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?

Oct 26 2026 3:06 PM | Updated on Oct 26 2026 3:17 PM

Hyundai Bayon Launched in India at Rs 9 99 Lakh

ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ దేశీయ విఫణిలో మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ విభాగంలో బయాన్‌(Bayon)ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). కొన్ని వారాల క్రితం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, కాబట్టి డెలివరీలు వెంటనే మొదలవుతాయి.

హ్యుందాయ్ కంపెనీ ఈ బయాన్‌ కారును చెన్నై ప్లాంట్‌లో రైట్-హ్యాండ్-డ్రైవ్, లెఫ్ట్-హ్యాండ్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో తయారు చేస్తోంది. అంటే ఎగుమతులు కూడా ఇక్కడ నుంచే జరుగుతాయన్నమాట. సింపుల్ స్టైలింగ్‌ను కలిగిన ఈ కారు.. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ పొందుతుంది.  డీఆర్ఎల్ బోనెట్ లైన్ వెడల్పుతోనే ఉంటాయి.  వీటికి ఎలాంటి కనెక్టెడ్ లైట్ బార్ ఉండదు. ఫ్లాట్ రూఫ్‌లైన్, రూఫ్ రైల్స్, వీల్ ఆర్చ్‌ల మీదున్న మందపాటి ప్లాస్టిక్ క్లాడింగ్ దీనికి ఒక ఎస్‌యూవీ రూపాన్ని ఇస్తాయి.

వెనుక వైపు.. బంపర్‌పై అమర్చిన ఇండికేటర్ల పైన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌లు ఉంటాయి. అదే సమయంలో ముందుకు పొడుచుకు వచ్చిన రూఫ్ స్పాయిలర్ మధ్యలో ఒక స్టాప్ ల్యాంప్‌ కూడా ఉంది. కారు లోపల రెండు 12.3-అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం.

ఫీచర్ల జాబితాలో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ టోన్ లెదరెట్ అప్‌హోల్స్టరీ, వైర్‌లెస్ ఛార్జింగ్, కూల్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, వెనుక ప్రయాణీకుల కోసం అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం ఉన్నాయి. సేఫ్టీ కిట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, బయాన్‌ క్రెటాలోని 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే వస్తుంది. ఇది 113 bhp పవర్, 144Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని మైలేజీ 18.6 కిమీ/లీ అని సమాచారం. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో టర్బో పెట్రోల్ లేదా డీజిల్ ఆప్షన్ లేదు. అయితే సీఎన్జీ వెర్షన్ జనవరి 2027లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: డ్రైవింగ్‌ లైసెన్స్‌ రూల్స్‌లో మార్పులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement