చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ (BYD) భారత్‌లో తన లగ్జరీ కార్ల బ్రాండ్ డెన్జా (Denza)ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. నవంబర్ 13న ఈ బ్రాండ్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న బీవైడీ.. ఇప్పుడు ఖరీదైన ప్రీమియం కార్ల మార్కెట్‌పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా డెన్జా బ్రాండ్ కింద డీ9 లగ్జరీ ఎంపీవీ, జెడ్9 జీటీ ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్లు సమాచారం.
డెన్జా డీ9 అనేది.. ఒక లగ్జరీ ఎంపీవీ. ఇందులో మూడు వరుసల సీటింగ్ పొజిషన్ ఉండటం వల్ల, ఏడుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది ఎంజీ ఎం9 వంటి లగ్జరీ ఎంపీవీలకు పోటీ ఇవ్వనుంది. అంతర్జాతీయ మార్కెట్లోని ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో 103.36kWh బ్యాటరీ(520 కిమీ రేంజ్)తో లభిస్తోంది. రెండో వరుస సీట్లకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేషన్, మసాజ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అయితే.. భారత్‌లో ఏ మోడల్ లాంచ్ అవుతుంది?, దాని ధర ఎంత అనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
మరోవైపు.. డెన్జా జెడ్9 జీటీ స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరుతో ఆకట్టుకోనుంది. దీని ధర రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ వెర్షన్‌లో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండగా.. అవి 1,156 హెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులోని 122.5kWh బ్యాటరీ.. ఒక్కసారి ఛార్జ్‌తో 600 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. భారత వెర్షన్ స్పెసిఫికేషన్లు వెల్లడి కావాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఆరమ్ ఎడిషన్‌తో.. విక్టోరిస్ మరింత కొత్తగా!


