హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle) దేశీయ మార్కెట్లో రెబల్ 500 (Rebel 500) బైకును లాంచ్ చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 4.50 లక్షలు, కాగా ఈ-క్లచ్ వెర్షన్ ధర రూ. 4.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). రూ. 5,000తో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అయితే అమ్మకాలు హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లకు మాత్రమే పరిమితమయ్యాయి.
హోండా రెబెల్ 500 బైక్ 471 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్ ద్వారా.. 8,500 rpm వద్ద 46 హార్స్ పవర్.. 6,000 rpm వద్ద 43.3 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఒక ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, 3.5 అంగుళాల రౌండ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఈ బైకులోని సీటు ఎత్తు 690 మిమీ మాత్రమే. కాబట్టి పొట్టిగా ఉండే రైడర్లు కూడా సులభంగా.. రైడ్ చేయవచ్చు. దీని బరువు 191 కేజీలు. ఇది ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మాకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ లేకుంటే.. రూ.10 వేలు ఫైన్!


