కేటీఎం భారతదేశంలో తన అప్డేటెడ్ 200 డ్యూక్ లాంచ్ చేసింది. దీని ధర రూ.2.07 లక్షలు. అంటే ఈ బైక్ రేటు మునుపటి కంటే రూ. 1,552 ఎక్కువన్నమాట. అయితే ఇది చాలా వరకు అప్డేట్ అయిందని సంస్థ చెబుతోంది. ఇందులో కొత్త రైడ్-బై-వైర్ థ్రాటిల్ ఉందని వెల్లడించింది.
ఫీచర్ల విషయానికి వస్తే.. థ్రాటిల్ రెస్పాన్స్‌ను మార్చేందుకు ఈ బైక్‌లో ఇప్పుడు స్ట్రీట్, రెయిన్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అదనంగా.. మెరుగైన భద్రత కోసం బ్రాండ్ ఒక ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను జోడించింది. తక్కువ వేగంతో బైక్ ఆగిపోకుండా నిరోధించే ఒక వ్యవస్థను సంస్థ ఇందులో ప్రవేశపెట్టింది. దీంతో ఇది నగర ప్రయాణాలను మరింత సులభతరం చేస్తుంది. ఉత్సాహభరితమైన రైడింగ్ కోసం, క్లచ్ లేకుండా గేర్లు మార్చడానికి వీలుగా డ్యూక్‌లో ఇప్పుడు బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ అమర్చబడింది.
2026 కేటీఎం బైక్ ఇప్పుడు లిక్విడ్-కార్బన్, బ్లాక్ అనే రెండు కొత్త రంగులో లభిస్తుంది. అయితే ఇందులో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి.. 24.67 bhp పవర్, 19.3 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే అదే 199.5 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. పనితీరులో పెద్దగా మార్పులు లేవని తెలుస్తోంది.
ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు ఇలా.. తులం ఎంతంటే?


