సైబర్‌ దాడికి పాల్పడిన చైనా ఏఐ మోడల్‌! | Chinese AI Defies Guardrails to Launch Complex Cyberattack in Testing | Sakshi
Sakshi News home page

పరీక్ష సమయంలో సైబర్‌ దాడికి పాల్పడిన చైనా ఏఐ మోడల్‌!

Oct 29 2026 2:15 PM | Updated on Oct 29 2026 2:44 PM

Chinese AI Defies Guardrails to Launch Complex Cyberattack in Testing

ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రపంచ దేశాలను కలవరపెట్టే ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ప్రముఖ చైనా ఏఐ సంస్థకు చెందిన ఫ్లాగ్‌షిప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్.. నియంత్రిత పరీక్షా సిమ్యులేషన్లలో అత్యంత సంక్లిష్టమైన సైబర్‌ దాడిని విజయవంతంగా నిర్వహించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ప్రయోగాల సమయంలో ఆ మోడల్ పదేపదే భద్రతా నిబంధనలను, ఆదేశాలను బేఖాతరు చేసినట్లు తేలింది. ఇది భవిష్యత్తులో డిజిటల్ భద్రతకు పెనుముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్న ఆందోళనలను వ్యక్తం చేస్తోంది.

నియంత్రిత పరీక్షల్లో ఏం జరిగింది?

టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు జరుగుతున్నప్పటికీ వాటివల్ల కలిగే దుష్పరిణామాలపై నిపుణులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతారు. ఇందులో భాగంగానే చేపట్టిన కంట్రోల్డ్ టెస్టింగ్ (నియంత్రిత పరీక్షలు) సమయంలో చైనాకు చెందిన జెడ్.ఏఐ (Z.AI) సంస్థకు చెందిన ఏఐ మోడల్ ప్రవర్తన పరిశోధకులను విస్మయానికి గురిచేసింది. మనుషుల ప్రమేయం లేకుండానే స్వయంగా నిర్ణయాలు తీసుకోగల ఈ మోడల్ డిజిటల్ నెట్‌వర్క్‌లలోని లోపాలను ఆసరాగా చేసుకొని కాంప్లెక్స్ సైబర్‌ దాడికి పాల్పడింది. అత్యంత కఠినమైన భద్రతా వలయాలు, నిబంధనల మధ్య నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా తనంతట తానుగా వ్యవహరించడం టెక్ వర్గాల్లో కలవరం రేపుతోంది.

భద్రతా నిపుణుల ఆందోళనలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలు వేగంగా పరిపక్వత చెందుతుండటం, ఓపెన్-వెయిట్ ఆర్కిటెక్చర్‌ల ద్వారా వాటిని ఎవరైనా సులభంగా డౌన్‌లోడ్ చేసుకుని తమ అవసరాలకు తగ్గట్టు మార్చుకునే అవకాశం ఉండటం సైబర్‌ సెక్యూరిటీకి సవాల్‌గా మారుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ ఏఐ టూల్స్ కోడ్ విశ్లేషణ, ఎర్రర్‌లను గుర్తించడంలో ఎంత వేగంగా పనిచేస్తున్నాయో, అదే స్థాయిలో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే విధ్వంసం సృష్టించడంలోనూ అంతే ప్రమాదకరంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్‌కు విద్యుత్‌ నిలిపివేత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement