డేటా సెంటర్‌ల విద్యుత్ దాహం తీరేదెలా? | How AI Data center Power Hunger Unleashed Fuel Cell Boom | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్‌ల విద్యుత్ దాహం తీరేదెలా?

Oct 24 2026 11:29 AM | Updated on Oct 24 2026 11:31 AM

How AI Data center Power Hunger Unleashed Fuel Cell Boom

ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న వేళ డిజిటల్ ప్రపంచం ఒక కొత్త సవాల్‌ను ఎదుర్కొంటోంది. అదే శక్తి కొరత (పవర్ క్రైసిస్). టెక్ దిగ్గజాలు అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లకు శిక్షణనిచ్చేందుకు భారీ డేటా సెంటర్‌లను ఏర్పాటు చేస్తుండటంతో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో సాంప్రదాయ విద్యుత్ గ్రిడ్‌లపై భారాన్ని తగ్గించుకోవడానికి, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను పొందేందుకు టెక్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘ఫ్యూయెల్ సెల్స్’కు డిమాండ్ పుంజుకుంటున్నట్లు కొన్ని సంస్థలు చెబుతున్నాయి.

విద్యుత్ గ్రిడ్‌పై భారం

గోల్డ్‌మన్ శాచ్స్ వంటి ప్రముఖ సంస్థల అంచనాల ప్రకారం ఏఐ డేటా సెంటర్‌ల విస్తరణ కారణంగా రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగనుంది. ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ గ్రిడ్‌లు ఈ భారీ డిమాండ్‌ను తట్టుకోలేకపోతున్నాయి. గ్రిడ్ అనుమతులు లభించడానికి సంవత్సరాల సమయం పడుతుండటంతో టెక్ కంపెనీలు గ్రిడ్‌తో సంబంధం లేకుండా సొంతంగా ఆన్-సైట్ విద్యుత్ వనరులను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ లేదా హైడ్రోజన్ ఆధారిత ఇంధన వ్యవస్థలైన ఫ్యూయెల్ సెల్స్ పరిశ్రమపై దృష్టి సారిస్తున్నాయి.

ఫ్యూయెల్ సెల్స్ ప్రత్యేకత ఏమిటి?

సాంప్రదాయ పద్ధతిలో కాకుండా సహజ వాయువు లేదా హైడ్రోజన్ వంటి ఇంధనాలకు, ఆక్సిజన్‌ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా నేరుగా విద్యుత్తును ఉత్పత్తి చేసే పద్ధతే ఫ్యూయెల్ సెల్ టెక్నాలజీ. ఇవి అత్యంత పర్యావరణ అనుకూలమైనవిగా మారడమే కాకుండా తక్కువ స్థలంలో వేగంగా ఇన్‌స్టాల్ చేసుకునే వీలు ఉంటుంది. ఉదాహరణకు, బ్లూమ్ ఎనర్జీ వంటి అగ్రగామి సంస్థలు సాలిడ్-ఆక్సైడ్ సాంకేతికతను ఉపయోగిస్తూ 100 శాతం స్వచ్ఛమైన హైడ్రోజన్‌తో నడిచే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తుంది. మరికొన్ని సంస్థలు మోల్టన్ కార్బోనేట్ టెక్నాలజీని వాడుతున్నాయి. ఇంధన లభ్యతకు తగ్గట్టుగా ఇవి మార్పు చెందడం డేటా సెంటర్ నిర్వాహకులకు పెద్ద వెసులుబాటుగా మారింది.

వ్యాపార వృద్ధి - ఆర్థిక ఫలితాలు

ఏఐ డేటా సెంటర్‌ల నుంచి వస్తున్న భారీ డిమాండ్ కారణంగా ఫ్యూయెల్ సెల్ తయారీ కంపెనీల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. బ్లూమ్ ఎనర్జీ వంటి కంపెనీలు తమ త్రైమాసిక ఆదాయంలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేశాయి. డేటా సెంటర్ల అవసరాలకు తగినట్లుగా పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, వేగంగా ప్రాజెక్టులను అందుబాటులోకి తేవడం వల్ల ఈ రంగానికి భవిష్యత్తులో తిరుగులేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: స్వల్ప వ్యవధిలోనే వెండి రూ.30,000 డౌన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement