విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకుందాం | Telangana plans one-time settlement scheme for industrial power dues | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకుందాం

Oct 23 2026 4:59 AM | Updated on Oct 23 2026 4:59 AM

Telangana plans one-time settlement scheme for industrial power dues

ఉన్నతాధికారుల సమీక్షలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

యాదాద్రి ప్లాంట్‌లో 2 యూనిట్లకు కోల్‌ ఇండియా నుంచి ప్రత్యామ్నాయ బొగ్గు సరఫరా

మూతపడిన పరిశ్రమల విద్యుత్‌ బకాయిలకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అవకాశం

బకాయిల వసూళ్లు, విద్యుత్‌ ఉత్పత్తి పెంపుపై డిప్యూటీ సీఎం భట్టి  సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: కరువు పరిస్థితుల్లో జలవిద్యుత్‌ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదే శించారు. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, బొగ్గు లభ్యత, బకాయిల వసూళ్లపై సమగ్ర కార్యా చరణతో ముందుకు సాగాలని సూచించారు. సచివాలయంలో గురువారం విద్యు త్‌ శాఖ ఉన్నతాధికారులతో భట్టి సమీక్షించారు. రానున్న రోజుల్లో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు.

రోజువారీ ఉత్పత్తి 140 మిలియన్‌ యూనిట్లకు లక్ష్యం
రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్ప త్తిని మరింత పెంచాలని భట్టి చెప్పారు. టీజీజెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల రోజు వారీ సగటు ఉత్పత్తి 2024–25 ఆర్థిక సంవత్సరంలో 65.90 మిలియన్‌ యూని ట్లుగా ఉండగా, 2025–26లో సుమారు 76.46 మిలియన్‌ యూనిట్లకు చేరిందని అధికారులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ 21 నాటికి రోజు వారీ సగటు ఉత్పత్తి 90.97 మిలియన్‌ యూనిట్లకు పెరిగిందని తెలిపారు. ప్రస్తు తం సాధిస్తున్న ఉత్పత్తిని మరింత పెంచి రోజుకు 140 మిలియన్‌ యూనిట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని భట్టి  ఆదేశించారు.  

యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి
విద్యుత్‌ ఉత్పత్తి పెంపులో భాగంగా యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం సూచి ంచారు. ఐదో యూనిట్‌ను ఈ నెల 20న గ్రిడ్‌ కు అనుసంధానించినట్టు తెలిపారు. సాంకేతిక, నిర్వహణపరమైన సమస్యలను యుద్ధ ప్రాతి పదికన పరిష్కరించి, ఐదో యూనిట్‌ను పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలా పాల్లోకి తీసు కొచ్చేందుకు చర్యలు చేపడుతు న్నట్లు వెల్లడించారు.

 యాదాద్రి ప్లాంట్‌లోని రెండు యూని ట్లకు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కోల్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి ప్రత్యా మ్నాయ బొగ్గు సరఫరా మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బకాయిల పరిష్కా రానికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ విధానాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో ఎనర్జీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నవీన్‌ మిత్తల్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తాని యా, సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి, జెన్‌కో సీఎండీ హరీశ్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేశ్‌ వి. పాటిల్, ఆర్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement