భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక | Bathukamma and Bonalu Celebrate Telangana Cultural Identity: Governor Shukla | Sakshi
Sakshi News home page

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక

Oct 23 2026 4:52 AM | Updated on Oct 23 2026 4:52 AM

Bathukamma and Bonalu Celebrate Telangana Cultural Identity: Governor Shukla

అలయ్‌ బలయ్‌లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేస్తున్న చింతల, విజయలక్ష్మి, చాడ, విద్యాసాగర్‌రావు, శివప్రతాప్‌ శుక్లా దంపతులు, కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, గులాబ్‌ చంద్, జానారెడ్డి, కూనంనేని, కొండా విశ్వేశ్వరరెడ్డి

అలయ్‌ బలయ్‌ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల వారసత్వంగా నిలుస్తోంది

బతుకమ్మ, బోనాలు సాంస్కృతిక పరంపరను చాటుతున్నాయి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం భావనకు నిలువెత్తు సుందరరూపం...తెలంగాణ సంస్కృతీసంప్రదాయాల వారసత్వం ‘దత్తన్న అలయ్‌–బలయ్‌’ కార్యక్రమంలో సాక్షాత్కరిస్తోందని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా కొనియాడారు. అన్ని రాష్ట్రాల విశిష్ట సాంస్కృతిక వారసత్వా లను గౌరవించడమే భారత్‌ ఐకమత్యానికి చిహ్నమన్నారు.

గురువారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ‘నషా ముక్త్‌ భారత్‌–వికసిత్‌భారత్‌ 2047’నినాదంతో నిర్వహించిన దత్తన్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో గవర్నర్‌ మాట్లా డారు. తెలంగాణ బతుకమ్మ, బోనాలు వంటివి ప్రజల సాంస్కృతిక పరంపర, సామూహిక ఐక్యతను చాటుతున్నాయని చెప్పారు. రాజకీయ విభేదాలు, వైరుధ్యాలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తెచ్చి సామాజిక ఐక్యత సందేశాన్ని అలయ్‌ బలయ్‌ ఇస్తోందన్నారు. 2005లో బండారు దత్తా త్రేయ ప్రారంభించిన ఈ ఘనమైన కార్యాన్ని ఫౌండేషన్‌ ద్వారా ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని చెప్పారు. 

⇒ అలయ్‌బలయ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడుబండారు దతా ్తత్రేయ మాట్లాడుతూ ఇది కుల,మతాలు, రాజకీ యాలు, ప్రాంతాలకతీతంగా కలిసే వేదిక అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి మెలసి ఉండాలని, అభివృద్ధి చెందాలని తన ఆకాంక్షను వెలిబుచ్చారు. 
⇒ అలయ్‌బలయ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి మాట్లా డుతూ తెలంగాణ అంటే సుక్క, ముక్క కాదని అన్యా యానికి తలవంచని ఆత్మగౌరవం, అధర్మాన్ని ఎదిరించే ధీరత్వానికి ప్రతీక అన్నారు. తెలంగాణ డప్పులో ఉన్న విన్యాసం మరెక్కడా లభించదని, తెలంగాణ ఒగ్గులో ఉన్నంత ఊపు మరోచోట ఉండదని చెప్పారు. 

పంజాబ్‌కు మత్తే పెద్ద విపత్తు
ప్రస్తుతం మాదకద్రవ్యాల ముప్పు నుంచి యువతను తప్పించడమే పంజాబ్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య, సవాల్‌గా మారిందని ఆ రాష్ట్ర గవర్నర్‌ గులాబ్‌చంద్‌ కఠా రియా ఆవేదన వెలిబుచ్చారు. పంజాబ్‌ దేశ సరిహద్దు రాష్ట్రం కావడంతో భారత్‌ను ఆయుధాలతో ఓడించలేక నవయువత ను డ్రగ్స్‌కు బానిసలుగా చేసి నిర్వీర్యులను చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అలయ్‌బలయ్‌ ద్వారా విభిన్న కళా రూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నివర్గాల వారిని ఒకవేదికపైకి తీసుకొచ్చి ఐక్యతను చాటడం గొప్ప విష యమని చెప్పారు. 

⇒  మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడు తూ ఇది కేవలం ఉత్సవం కాదని, భిన్నత్వంలో ఏక త్వాన్ని ఆచరణలో చూపి, కులమతాలకు అతీతంగా ఆత్మీయతకు నిలువుటద్దంగా నిలుస్తుందన్నారు. 
⇒ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నన్ని రోజులే సెక్యు లరిజం కొనసాగుతుందని కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అనేక దేశాల్లో మైనారిటీలు పండుగలు జరుపుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఉందన్నారు. 

⇒ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లా డుతూ ఇది రాజకీయవేదిక కాదని, పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా మానవత్వం పరిమళించే వేదిక అన్నారు. బండారు విజయలక్ష్మి, డా.బి.జిగ్నేశ్‌రెడ్డి దంపతుల కుమార్తెలు జశోధర, వేదాంశి వందేమాతరం పూర్తిగీతం ఆలపించగా, గవర్నర్లు శివప్రతాప్‌ శుక్లా, గులాబ్‌చంద్‌ కఠారియాలు జ్యోతి ప్రజ్వలన చేసి అలయ్‌ బలయ్‌ను ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యా సాగర్‌రావు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్‌ వెంకటస్వామి, ప్రభుత్వసలహాదారులు కె.కేశవరావు, వి.హనుమంతరావు, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎం.రఘునందన్‌రావు, మాజీమంత్రి కె.జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్, పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీలు డా.చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమరయ్య, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ జీవీరావు వేమూరి రామకోటేశ్వరరావు, 2026 ఆసియాడ్‌ లో రెండు స్వర్ణాలు గెలిచిన ఆర్చర్‌ తానిపర్తి చికితారావు, టైక్వండో కోచ్‌ కొండా సహదేవ్, ఉత్తమ ఉపాద్యాయిని కొంపల్లి భవాని, పులిరాజు, సయ్యద్‌ ఖాలిద్‌ షహబాద్‌లను సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement