భార్య ఫిర్యాదు చేసినంత మాత్రాన.. ఉద్యోగం తొలగించలేరు | High Court criticizes the state government conduct | Sakshi
Sakshi News home page

భార్య ఫిర్యాదు చేసినంత మాత్రాన.. ఉద్యోగం తొలగించలేరు

Oct 23 2026 4:44 AM | Updated on Oct 23 2026 4:52 AM

High Court criticizes the state government conduct

రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: భార్య పెట్టిన క్రిమినల్‌ కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) ప్రొబేషన్‌ను ఖరారు చేయకుండా, ఉద్యోగం నుంచి తొలగించడం సబబుకాదని హైకోర్టు స్పష్టం చేసింది. విధి నిర్వహణలో దురుసుగా వ్యవహరించినట్లు, ప్రభుత్వ విధులకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు ఆధారాలు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. 2018, నవంబర్‌ 20న కె.జానయ్య సివిల్‌ ఎస్సైగా నియమితులై రెండేళ్ల ప్రొబేషన్‌లో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌లో వేధింపులు, వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదైంది. దీంతో ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించి.. చర్యలపై మధ్యంతర స్టే పొందారు. అయితే.. ప్రొబేషన్‌ ముగిసినా ఉద్యోగం ఇవ్వకుండా తొలగించడంతో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. ఉద్యోగం నుంచి తొలగించడాన్ని పక్కనపెట్టేలా ఆదేశాలు పొందారు. 

దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పి.శామ్‌ కోషి, జస్టిస్‌ నర్సింగ్‌రావు నందికొండ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. భార్య ఫిర్యాదు మేరకు నమోదైన క్రిమినల్‌ కేసు ఇంకా తుది నిర్ణయానికి రాలేదని గుర్తుచేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ అప్పీల్‌ను కొట్టివేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement