అభివృద్ధి కార్యక్రమాలతోపాటు బహిరంగసభల్లో పాల్గొనే అవకాశం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అ మిత్‌షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కా ర్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు, కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు నవంబర్‌లో అమిత్‌షా రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం. గతంలో ఖరారైన అమిత్‌షా తెలంగాణ పర్యటన అనివార్య కారణాల వాయిదా పడిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల్లో ఆయన కచ్చితంగా రాష్ట్రానికి వచ్చే అవకాశముందని అంటున్నారు. బీజేవైఎం కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతోపాటు, వచ్చే ఎన్నికలకు రాష్ట్ర పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు అమిత్‌షా రానున్నట్టు పార్టీవర్గాల సమాచారం.
ఓ టీవీ చానెల్ నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమానికి అమిత్‌షా హాజరుకా వొచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లేదా కరీంనగర్‌లో భారీ బహిరంగసభ నిర్వహించే అవకాశం ఉంది. అదేవిధంగా డిసెంబర్‌లో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని, వరంగల్ విమానాశ్రయ శంకుస్థా పన, కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం సమ్మక్క–సారక్క గిరిజన కేంద్రీయ విశ్వవి ద్యాలయం ప్రారంభం, నేషనల్ హైవేల ప్రారంభోత్సవాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీనేతలు చెబుతున్నారు. ప్రధాని పర్య టన సందర్భంగా హైదరాబాద్ లేదా వరంగల్‌లో అభివృధ్ది కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోపాటు బహిరంగసభ నిర్వహించవచ్చని తెలుస్తోంది.
ఈ సభ ద్వారా కాంగ్రెస్, ఇండి కూటమి చేస్తున్నవ్య తిరేక ప్రచారాన్ని ఎండగట్టడంతో పాటు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్, ఇతర విపక్షాలు, సీజేపీ చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లడంతోపాటు ప్రభావం చూపుతు న్నట్టు అంతర్గత నివేదికలందాయి. దీంతోబీజేపీ జాతీయ స్థాయిలో అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో మోదీ, అమిత్‌షాతోపాటు పలువురు కేంద్రమంత్రు లు, ముఖ్యనేతలు రాష్ట్రానికి రానున్నట్టుగా తెలుస్తోంది.


