రేపు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం | BRS Leaders To Visit Medigadda Barrage: Telangana | Sakshi
Sakshi News home page

రేపు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

Oct 23 2026 4:43 AM | Updated on Oct 23 2026 4:43 AM

BRS Leaders To Visit Medigadda Barrage: Telangana

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, గోదావరి జలాల వినియోగంపై నిలదీసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల బృందం శనివారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఅర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పర్యటనలో పాల్గొననున్నారు.

ఇప్పటికే 734 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోయాయని, ప్రస్తుతం నదిలో సుమారు 1.15 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని సీనియర్‌ విశ్రాంత ఇంజనీర్లు చెబుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. మేడిగడ్డ వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి రోజుకు 1.4 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని, తద్వారా ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడి నుంచి ప్రజలను కాపాడవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement