ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్
ఏఐ ఇక ప్రత్యేక సాంకేతికతగా కాకుండా ప్రతి వ్యాపార సంస్థకు కీలక మౌలిక వసతిగా మారనుందని ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సెన్ హువాంగ్ స్పష్టం చేశారు. ‘చివరికి ప్రతి కంపెనీ ఏఐ కంపెనీ అవుతుంది. ప్రతి పరిశ్రమపై ఏఐ ప్రభావం ఉంటుంది’ అని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు.
ఏఐ విస్తరణలో యూరప్ వెనుకబడకూడదంటే మొత్తం ఏఐ స్టాక్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని హువాంగ్ పేర్కొన్నారు. డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక వసతులు, ఏఐ మోడళ్లు, ఏజెంట్లు, చాట్బాట్లు, అప్లికేషన్ల వరకు సమగ్ర పర్యావరణ వ్యవస్థను నిర్మించాల్సిందేనని చెప్పారు. ఎన్విడియా గత ఏడాదిలో యూరప్‌లోని ఏఐ ఎకోసిస్టమ్‌లో ఇప్పటికే 8 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిందని, మరికొన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రణాళికలో ఉన్నాయని వెల్లడించారు.
ఈ దిశగా ఏఐ వినియోగం కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కావడం లేదు. ఎన్విడియా తాజా వ్యూహంలో ఏఐ ఏజెంట్లు, పారిశ్రామిక రోబోటిక్స్, స్వయంచాలక వాహనాలు, ఫిజికల్ ఏఐ కీలకంగా మారుతున్నాయి. 2026 మార్చిలో హువాంగ్ మాట్లాడుతూ ప్రతి పారిశ్రామిక సంస్థ భవిష్యత్తులో రోబోటిక్స్ సంస్థగా మారుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో సేల్స్‌ఫోర్స్ డ్రీమ్ఫోర్స్లోనూ హువాంగ్ ఇదే దృక్పథాన్ని పునరుద్ఘాటించారు. భవిష్యత్తు ఏజెంటిక్ ఎంటర్ప్రైజ్దేనని, సంస్థలు తమ కార్యకలాపాల్లో స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్లను భారీగా వినియోగిస్తాయని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: రోజూ చూసే రూపీ సింబల్ వెనుక దాగున్న రహస్యాలు


