2030 నాటికి 35 కోట్ల కొత్త కొలువులు!  | Manufacturing and services sectors create more than 35 crore new jobs by 2030 | Sakshi
Sakshi News home page

2030 నాటికి 35 కోట్ల కొత్త కొలువులు! 

Oct 24 2026 5:32 AM | Updated on Oct 24 2026 5:32 AM

Manufacturing and services sectors create more than 35 crore new jobs by 2030

తయారీ, సేవల రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు 

నైపుణ్య శిక్షణపై దృష్టి పెట్టాలంటున్న పరిశ్రమ వర్గాలు 

ఇండియా డిడాక్టిక్స్‌ అసోసియేషన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: భారత తయారీ, సేవల రంగాల్లో 2030 నాటికి 35 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రావచ్చని పలు రంగాల స్కిల్‌ కౌన్సిళ్లు, పారిశ్రామిక సంస్థల తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ భారీ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాభివృద్ధి, ప్రాక్టికల్‌ శిక్షణను వేగవంతం చేయడంతో పాటు, పరిశ్రమలు–విద్యాసంస్థల మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని ఇండియా డిడాక్టిక్స్‌ అసోసియేషన్‌ (ఐడీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ రంగాల కౌన్సిళ్లు, ప్రభుత్వ వర్గాల గణాంకాలు పరిశీలిస్తే, నైపుణ్యాల కొరత సవాలు తీవ్రత, తక్షణ చర్యల అవసరాన్ని సూచిస్తున్నాయని ఐడీఏ పేర్కొంది. 

రంగాల వారీగా అంచనా వేసిన కొలువులు  
2030 నాటికి ఆటోమొబైల్‌ రంగంలో 20–25 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు కొత్తగా ఏర్పడవచ్చని అంచనా. అదే సమయానికి లాజిస్టిక్స్‌ రంగానికి అదనంగా 47 లక్షల మంది నైపుణ్యమున్న సిబ్బంది అవసరమవుతారు. టెలికాం రంగంలో 10 లక్షల కొత్త ఉద్యోగాలు, క్లీన్‌ ఎనర్జీ రంగంలో 44 లక్షలకు పైగా పూర్తి స్థాయి ఉద్యోగాలు అందుబాటులోకి రావచ్చని అంచనాలున్నాయి. వస్త్ర, దుస్తుల (జౌళి) పరిశ్రమలో రాబోయే మూడేళ్లలో దాదాపు రెండు కోట్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడవచ్చని స్కిల్‌ కౌన్సిళ్లు, పారిశ్రామిక సంస్థలు పేర్కొన్నాయి. 

నైపుణ్యాల పెంపు కీలకం 
మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్య, నైపుణ్య శిక్షణ వ్యవస్థలను తీర్చిదిద్దాల్సిన అవసరంపై పరిశ్రమలు, విద్యారంగ నిపుణుల్లో అవగాహన పెరుగుతోందని ఐడీఏ తెలిపింది. ‘‘ఉద్యోగాలు సృష్టించడమే సవాలు కాదు. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మన శ్రామికశక్తికి తగిన నైపుణ్యాలు కలి్పంచాలి. సర్టిఫికెట్ల ఆధారిత  విద్య నుండి ‘సామర్థ్య ఆధారిత అభ్యాసన’ వైపు మారాలి. ప్రాక్టికల్‌ నైపుణ్యాలు, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుభవం, మార్పులకు అనుగుణంగా పనిచేసే సామర్థ్యం తదితర అంశాలు ఉద్యోగార్హతలో కీలకం కావాలని ‘ఐడీఏ’ పేర్కొంది. 

వివిధ రంగాల ప్రతినిధుల స్పందన 
ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఆధునిక సాంకేతికతలు ఉత్పత్తుల రూపకల్పన, తయారీ విధానాలను మార్చనున్నాయని ఫరి్నచర్‌ అండ్‌ ఫిట్టింగ్స్‌ స్కిల్‌ కౌన్సిల్‌ సీఈఓ రాహుల్‌ మెహతా అన్నారు. అయితే, ఉత్పత్తులను రూపొందించడం, తయారు చేయడం, అమర్చడం, వాస్తవిక సమస్యలను పరిష్కరించడం వంటి పనులకు నైపుణ్యమున్న సిబ్బంది అవసరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘‘అత్యుత్తమ ప్రాక్టికల్‌ నైపుణ్యాలు, డిజిటల్‌ పరిజ్ఞానాన్ని సమిష్టిగా పెంపొందించుకునే వారే భవిష్యత్తులో అత్యుత్తమ ప్రొఫెషనల్స్‌గా నిలుస్తారు’’ అని వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లంబింగ్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూఎంపీఎస్‌సీ) సీఈఓ వరుణ్‌ టాండన్‌ తెలిపారు. 

బెంగళూరులో డీఐడీఏసీ ప్రదర్శనలు 
నైపుణ్యాభివృద్ధి, విద్యారంగ భవిష్యత్తుపై చర్చలకు నవంబరు 25–27 తేదీల్లో బెంగళూరులో జరగనున్న ‘డీఐడీఏసీ స్కిల్స్‌’ వేదిక కానుంది. నైపుణ్యాల రంగానికి సంబంధించి ఆసియాలోనే అతిపెద్దది, భారత్‌లో ఏకైక కాని్ఫరెన్స్‌గా నిర్వహకులు దీనిని పేర్కొన్నారు. అలాగే విద్యారంగానికి చెందిన ‘డీఐడీఏసీ ఇండియా’ సదస్సు కూడా జరగనుంది. ఈ రెండు కార్యక్రమాలు ‘విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల భవిష్యత్తు’పై చర్చించేందుకు ఒకే వేదికను అందించనున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement