breaking news
New Job Opportunities
-
కార్యాలయ ఉద్యోగ నియామకాలు పుంజుకోవచ్చు
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో పెరగొచ్చని నౌకరీ ‘హైరింగ్ సర్వే’ తెలిపింది. కొత్త ఉద్యోగాల సృష్టి ద్వారా నియామకాలు చేపట్టనున్నట్టు 72 శాతం సంస్థలు సర్వేలో భాగంగా తెలిపాయి. మొత్తం మీద 94 శాతం కంపెనీలు ద్వితీయ ఆరు నెలల్లో నియమకాల పట్ల సానుకూలత వ్యక్తం చేశాయి. 1,300 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా నౌకరీ తెలుసుకుంది. ఏఐ కారణంగా ఉద్యోగాల నష్టం ఏర్పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. 87 శాతం కంపెనీలు ఉపాధిపై ఏఐ ప్రభావం లేదని చెప్పాయి. ఇక 13 శాతం సంస్థలు ఏఐ కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రేరణగా పేర్కొన్నాయి. ఐటీ రంగంలో 42 శాతం, అనలైటిక్స్‌లో 17 శాతం, బిజినెస్ డెవలప్మెంట్లో 11 శాతం మేర కంపెనీలు ఏఐ ఆధారిత కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాయి. ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి డిమాండ్ నియామకాలకు మద్దతుగా నిలుస్తున్నట్టు నౌకరీ తెలిపింది. సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 37 శాతం ఐటీ పోస్ట్‌లకు నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపాయి. సంప్రదాయ ఐటీ విధుల కంటే అత్యాధునిక టెక్నాలజీలకు సంబంధించి నిపుణుల నియామకాలకు కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెషిన్ లెరి్నంగ్, డేటా సైన్స్, ఏఐ నిపుణులకు డిమాండ్ నెలకొంది. 4–7 ఏళ్ల అనుభవం ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే 47 శాతం కంపెనీలు సీనియర్లనే తీసుకోవాలని చూస్తున్నాయి. ఆరంభ స్థాయి ఉద్యోగుల నియామకాల పట్ల 29 శాతం కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. 8–12 ఏళ్ల అనుభవం ఉన్న వారి కోసం 17 శాతం సంస్థలు చూస్తున్నాయి.కొత్త ఉద్యోగాల కల్పన సానుకూలం.. ‘‘72 శాతం కంపెనీలు ఖాళీలను భర్తీ చేసుకోవడం కంటే కొత్త ఉద్యోగాలను సృష్టించి, భర్తీ చేసుకోవాలని చూస్తుండడం ఉత్సాహాన్నిస్తోంది. ఇక 87 శాతం సంస్థలు ఏఐ కారణంగా ఉద్యోగాల నష్టం ఉండదని భావిస్తున్నాయి. ఏఐ ఉద్యోగ కోతలకు దారితీస్తుందంటూ అంతర్జాతీయంగా నెలకొన్న అభిప్రాయాలకు ఇది విరుద్ధంగా ఉంది’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వివరించారు. -
ఉద్యోగానికి సరిగ్గా సరిపోతారు.. అందుకే రిజెక్ట్!
కొత్త ఉద్యోగానికి సరిపడా అర్హతలు లేక చాలా మంది తిరస్కరణను ఎదుర్కొంటారు. తనకు అన్ని అర్హతలు ఉండి, సదరు కొత్త జాబ్‌ను చేయగల సమర్థత ఉన్నాసరే ఉద్యోగాన్ని పొందలేకపోవడంతో ఒక అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని చూసి అవాక్కయింది. తర్వాత ఆ తిరస్కరణ తాలూకు వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అందరితో పంచుకుంది. గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ.. అనూ శర్మ అనే ఈ అమ్మాయి ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, జీతం, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వేరే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో రెజ్యూమ్, వివరాలు పంపారు. ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుంటే ‘తిరస్కరిస్తున్నాం’అన్న సందేశం వచి్చంది. ఉద్యోగంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను సంస్థ వివరించింది. ‘‘మీ రెజ్యూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ తేలిందేమంటే సదరు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతురాలు మాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేసే వాళ్లలో సాధారణంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరింత మెరుగైన ఉద్యోగాన్ని వీలైనంత త్వరగా వెతుక్కుని పాత ఉద్యోగాన్ని వదిలేస్తారు’’అని వివరణ ఇచి్చంది. ఇలాంటి కారణాలకు కూడా తిరస్కరిస్తారా? అని ఆమె ఆలోచనలో పడింది. ‘‘అర్హతలున్నా ఉద్యోగం ఎందుకు రాదో మీకు తెలుసా?’అంటూ అనూ శర్మ సంబంధిత సంస్థ రిప్లై స్క్రీన్‌షాట్‌ను ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు.స్పందనల వెల్లువఅనూ శర్మ పెట్టిన పోస్ట్‌కు స్పందనల వరద మొదలైంది. ‘‘అతి అర్హతలతో బాధపడుతున్నారా?’అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక మంచి పరిణామానికి సంకేతం. ఒకరి దగ్గర పనిచేయడం మానేసి మీరే సొంతంగా కంపెనీ పెట్టి ఉద్యోగాలివ్వండి’అని మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఉద్యోగం చేసే స్థాయి మీకున్నా, ఇచ్చేస్థాయి మాకు లేదు అని కంపెనీయే ఒప్పుకుంది’’అని మరొకరు ట్వీట్‌చేశారు. సంస్థనూ మెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు ఉన్నారు. ‘‘కంపెనీ మంచిపనే చేసింది. అర్హత కాస్తంత తక్కువ ఉంటే ఉద్యోగం ఇచ్చి, పని బాగా చేయించి రాటుదేలాలా చేస్తారు. ఈమెలాగే అప్పటికే మంచి ప్రతిభ ఉంటే మధ్యలోనే మానేస్తారు. అప్పుడు మళ్లీ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్, శిక్షణ అంటూ సంస్థ ఉద్యోగ వేట మళ్లీ మొదలవుతుంది’’అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ‘‘కనీసం రెజ్యూమ్ చదవకుండా, ఏవేవో పిచ్చి కారణాలు చెప్పకుండా నిజాయతీగా రిప్లై ఇచ్చిన సంస్థను మెచ్చుకోవాల్సిందే’అని ఇంకొకరు ట్వీట్‌చేశారు. దీంతో సరిగ్గా సరిపోయే అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వాలా? లేదంటే కాస్తంత తక్కువ అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి తమకు తగ్గట్లు తీర్చిదిద్దుకోవాలా? అన్న చర్చ మొదలైంది. – న్యూఢిల్లీ -
అవకాశాల వేటలో నిపుణులు
న్యూఢిల్లీ : దేశంలోని చాలా మంది నిపుణులు వారు చేస్తున్న ఉద్యోగాలతో సంతృప్తిగా ఉన్నా, కొత్త ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్నారు. ఈ విషయం లింక్డ్ఇన్ నిర్వహించిన ‘టాలెంట్ ట్రెండ్స్ ఇండియా’ నివేదికలో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. దాదాపు 55 శాతం మంది నిపుణులు మంచి అవకాశాల కోసం ఇతర ఉద్యోగాల వైపు చూస్తున్నారు. దాదాపు 95 శాతం మంది నిపుణులు ఇంటర్య్వులకు హాజరైన తర్వాత... కంపెనీలు వారి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవాలని ఆశిస్తున్నారు. కాగా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ అనుభవం ఆ వ్యక్తిని ఉద్యోగంలోకి చేర్చుకోవడమా? లేదా? అనే అంశాన్ని ప్రభావితం చేస్తుందని లింక్డ్ఇన్ ఇండియా ైడె రెక్టర్ ఇర్ఫాన్ అబ్దుల్లా తెలిపారు. పరిహారం, వేతనం, వృత్తిపరమైన అభివృద్ధి వంటి అంశాలే చివరకు ఉద్యోగ ఎంపికలో ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.