breaking news
services sectors
-
డిసెంబర్లో నెమ్మదించిన ‘సేవలు’
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం డిసెంబర్లో మందగించింది. ఇందుకు సంబంధించి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 52.3గా నమోదయ్యింది. నవంబర్లో ఈ సూచీ 53.7 వద్ద ఉంది. అమ్మకాల్లో వృద్ధి మందగించడం దీనికి ప్రధానకారణమని ఆర్థిక సమాచార సేవల దిగ్గజ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీనా డీ లిమా పేర్కొన్నారు. నిజానికి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీని ప్రాతిపదికన డిసెంబర్ వరకూ వరుసగా మూడవనెల బిజినెస్ యాక్టివిటీ సూచీ వృద్ధి ధోరణిలోనే ఉంది. బలహీన వ్యాపార ఆశావాద పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్లో ఉపాధి కల్పన తగ్గిందని, అమ్మకాలు మూడు నెలల కనిష్టానికి పడ్డాయనీ పోలీనా డీ లిమా వివరించారు. బ్రిటన్ కొత్త స్ట్రెయిన్, దీనితో తిరిగి గ్లోబల్ కోవిడ్–19 ప్రయాణపు ఆంక్షలు, డిమాండ్ పరిస్థితులపై ఆయా అంశాల ప్రతికూల ప్రభావం, 2020 చివరిలో భారత్ సేవల రంగాన్ని నెమ్మదింపజేసి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సేవలు, తయారీ రెండూ కలిపినా తగ్గుదలే! కాగా సేవలు, తయారీ రెండు రంగాలూ కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ కూడా నవంబర్తో పోల్చితే డిసెంబర్లో 56.3 నుంచి 54.9కి పడిపోయింది. ‘‘అయితే 2021లో ఉత్పత్తి పెరుగుతుందన్న ఆశావహ అంచనాలను కంపెనీలు కొనసాగిస్తున్నాయి. అయితే 2021 తొలి కాలంలో సవాళ్లు కొనసాగుతాయి. అయితే అటు తర్వాత సుస్థిర రికవరీ కొనసాగుతుంది. కోవిడ్–19 లభ్యత ఒకసారి ప్రారంభమైన తర్వాత మరింతగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి’’ అని పోలీనా డీ లిమా పేర్కొన్నారు. -
చైనాను అధిగమించిన భారత్ తయారీ, సేవల వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ తయారీ, సేవల రంగాలు ఫిబ్రవరిలో చైనాలోని ఇదే రంగాలతో పోల్చితే మంచి పనితీరును కనబరిచాయి. హెచ్ఎస్బీసీ సర్వే ఒకటి గురువారం ఈ విషయాన్ని తెలిపింది. భారత్కు సంబంధించి హెచ్ఎస్బీసీ కాంపోజిట్ ఇండెక్స్ 53.5 వద్ద ఉంది. చైనా విషయంలో ఈ సూచీ 51.8 వద్ద ఉంది. బ్రెజిల్ సూచీ 51.3 వద్ద, రష్యా 44.7 వద్ద ఉంది. హెచ్ఎస్బీసీ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే వృద్ధి ధోరణిగా, దిగువన ఉంటే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. మూడు రోజుల క్రితం భారత్కు సంబంధించి ఒక్క తయారీ రంగం పనితీరును హెచ్ఎస్బీసీ సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) కూర్పు ఆధారంగా రూపొందించిన ఈ గణాంకాల ప్రకారం భారత తయారీ రంగ సూచీ ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2015 ఫిబ్రవరిలో ఈ సూచీ 51.2 పాయింట్లుకాగా, 2015 జనవరిలో 52.9 పాయింట్లు.