చైనాను అధిగమించిన భారత్ తయారీ, సేవల వృద్ధి | HSBC's 1.5pc cash Isa now pays £10 monthly bonus | Sakshi
Sakshi News home page

చైనాను అధిగమించిన భారత్ తయారీ, సేవల వృద్ధి

Mar 6 2015 1:28 AM | Updated on Sep 2 2017 10:21 PM

చైనాను అధిగమించిన భారత్ తయారీ, సేవల వృద్ధి

చైనాను అధిగమించిన భారత్ తయారీ, సేవల వృద్ధి

భారత్ తయారీ, సేవల రంగాలు ఫిబ్రవరిలో చైనాలోని ఇదే రంగాలతో పోల్చితే మంచి పనితీరును కనబరిచాయి.

న్యూఢిల్లీ: భారత్ తయారీ, సేవల రంగాలు ఫిబ్రవరిలో చైనాలోని ఇదే రంగాలతో పోల్చితే మంచి పనితీరును కనబరిచాయి. హెచ్‌ఎస్‌బీసీ సర్వే ఒకటి గురువారం ఈ విషయాన్ని తెలిపింది.  భారత్‌కు సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ కాంపోజిట్ ఇండెక్స్ 53.5 వద్ద ఉంది. చైనా విషయంలో ఈ సూచీ 51.8 వద్ద ఉంది. బ్రెజిల్ సూచీ 51.3 వద్ద, రష్యా 44.7 వద్ద ఉంది. హెచ్‌ఎస్‌బీసీ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే వృద్ధి ధోరణిగా, దిగువన ఉంటే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది.  

మూడు రోజుల క్రితం భారత్‌కు సంబంధించి ఒక్క తయారీ రంగం పనితీరును హెచ్‌ఎస్‌బీసీ సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) కూర్పు ఆధారంగా రూపొందించిన ఈ గణాంకాల ప్రకారం భారత తయారీ రంగ సూచీ ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2015 ఫిబ్రవరిలో ఈ సూచీ 51.2 పాయింట్లుకాగా, 2015 జనవరిలో 52.9 పాయింట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement