అల్ట్రావయోలెట్ కంపెనీ భారతదేశంలో తన ఎక్స్-47 వీనమ్ (Ultraviolette X-47 Venom) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.3 లక్షలు (ఎక్స్ షోరూమ్). కానీ మొదటి 5000 యూనిట్లను రూ.2.65 లక్షలకు విక్రయించనున్నారు. అక్టోబర్ 22 నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు నవంబర్ నుంచి మొదలవుతాయి.
కొత్త ఆర్కిటెక్చర్
అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వీనమ్ అనేది కొత్త ఆర్కిటెక్చర్ వీఎక్స్-100 100వీపై నిర్మితమైన బైక్. ఈ మోటార్‌సైకిల్ బరువు 180 కేజీలు. కొత్త బ్యాటరీ ప్యాక్ 15 శాతం తేలికగా ఉండి, 25 శాతం అధిక సామర్థ్యాన్ని అందిస్తుంది. అదే సమయంలో.. మునుపటి రేడియల్ సెటప్ స్థానంలో యాక్సియల్ కూలింగ్ అమరికను ఏర్పాటు చేయడం వల్ల, ఇది రెట్టింపు శీతలీకరణ పనితీరును అందిస్తుంది.
343 కిమీ రేంజ్
అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వీనమ్ బైక్ 11 kWh బ్యాటరీ ప్యాక్‌తో.. 343 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 2.7 సెకన్లలో 0-60 kmph, 5.9 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుందని, గరిష్ట వేగం 155 kmph ఉంటుందని అల్ట్రావయోలెట్ పేర్కొంది. అయితే ఎంట్రీ లెవల్ మోడల్ 7 kWh బ్యాటరీ పొందుతుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఫీచర్స్
అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వీనమ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. అందులో బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, లేన్-ఛేంజ్ అసిస్టెన్స్, ఓవర్‌టేక్ అలర్ట్‌లు, రియర్-కొలిజన్ వార్నింగ్‌లు ఉన్నాయి. వెనుక నుంచి ప్రమాదాన్ని గుర్తించినప్పుడు హజార్డ్ లైట్లు యాక్టివేట్ అవుతాయి. కాక్‌పిట్ మధ్యలో ఇంటర్‌ఫేస్ Xతో పనిచేసే కొత్త 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. దీనిలో ఆన్‌బోర్డ్ మ్యాపుల్స్ నావిగేషన్, రియర్ కెమెరా పార్క్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్
కొత్త ఎక్స్-47 వీనమ్ బైక్ ఆఫ్టర్‌బర్నర్ ఎల్లో, టర్బో రెడ్, కాస్మిక్ బ్లాక్ మరియు స్టెల్లార్ వైట్ రంగులలో లభిస్తుంది. అల్ట్రావయోలెట్ 8,00,000 కిలోమీటర్ల వరకు పొడిగించగల వారంటీ కవరేజీని కూడా ప్రకటించింది, అయితే దీనికి సంబంధించిన వివరణాత్మక నిబంధనలు.. అర్హత తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: కోట్లు పెట్టి కారు కొన్నాడు.. సర్వీస్ సెంటర్‌లో ఊహించని షాక్!


