ఇండియన్ బైక్స్: ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్‌లో..
బెంగళూరు బేస్డ్ కంపెనీ 'అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్'.. F77 పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్‌లో తన బైకులను లాంచ్ చేసింది.అల్ట్రావయోలెట్ బైకులు ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్‌తో సహా అనేక యూరోపియన్ మార్కెట్లలో విజయవంతమైన అమ్ముఅడవుతున్నాయి. ప్రపంచ వేదికపై భారతీయ ఇంజనీరింగ్‌ను ప్రదర్శించడం.. యూరప్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో మన ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా కంపెనీ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ మొత్తం 12 దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.అల్ట్రావయోలెట్ F77 MACH 2 & F77 సూపర్స్ట్రీట్అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ లాంచ్ చేసిన F77 MACH 2 అనేది ప్రత్యేకంగా రైడింగ్ చేసేవారికోసం రూపొందించగా.. ఎఫ్77 సూపర్‌స్ట్రీట్ రోజువారీ నియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని లాంచ్ చేసింది. అయితే ఈ రెండు మోడల్స్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. డిజైన్, ఫీచర్స్ విషయంలో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.ఇదీ చదవండి: 1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!ఇవి 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.. 40 హార్స్ పవర్, 100 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 155 కిమీ/గం వేగంతో వెళ్లే ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, రీజనరేవటివ్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.