వాహనాల తయారీ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఉత్పత్తి కోసం సిద్ధం చేసిన సరికొత్త సియెరాను ప్రదర్శించింది. నవంబర్ 25న దీన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో, 1991లో తొలిసారిగా ప్రవేశపెట్టిన సియెరా ప్రస్థానాన్ని ప్రదర్శించారు. కొత్త తరం అభిరుచులకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది.
అ్రల్టావయొలెట్ యూవీ స్పేస్ స్టేషన్ విస్తరణ
ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్స్ తయారీ సంస్థ అల్ట్రా వయొలెట్ తమ కొత్త యూవీ స్పేస్ స్టేషన్‌ను విజయవాడలో ప్రారంభించింది. (Ultraviolette UV Space Station in Vijayawada) ఇందులో ఎక్స్–47, ఎఫ్77 మాక్ 2, ఎఫ్77 సూపర్‌స్ట్రీట్ తదితర వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తిని బట్టి ఇవి 2.8 సెకన్లలో గంటకు 60 కి.మీ. వేగాన్ని అందుకోగలవు. ఒక్కసారి చార్జి చేస్తే 323 కి.మీ. వరకు రేంజి ఉంటుంది.


