ప్రముఖ ప్రీమియం ద్విచక్రవాహన సంస్థ కేటీఎం తమ పాపులర్ కేటీఎం ఆర్‌సీ390 బైక్‌కు వీడ్కోలు పలకనుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గిన కారణంగా ఆర్‌సీ390 బైక్ మోడల్ను నిలిపిపేయాలని నిర్ణయించుకుంది. ఎంసీఎన్ నివేదిక ప్రకారం.. సింగిల్-సిలిండర్ బైక్కు మార్కెట్లో తగినంత డిమాండ్ లేదు. దీంతో పాటు యూరో5+ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా 373 సీసీ ఇంజిన్ను నవీకరించాలంటే అయ్యే ఖర్చుతో దాని ధర భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఉత్పత్తిని ఇక ఆపేయడం మంచిదనే నిర్ణయానికి ఆస్ట్రియా బైక్ కంపెనీ వచ్చేసినట్లు తెలుస్తోంది.
దశాబ్దంపైనే..
కేటీఎం ఆర్సీ390 మొట్టమొదటిసారిగా 2014 లో భారత మార్కెట్లో విడుదలైంది. అప్పటి నుండి, ఈ సంవత్సరం తాజా అప్డేట్లో కలిసి రెండుసార్లు అప్డేట్ అయింది. మార్కెట్లో సుమారు 11 సంవత్సరాలపాటు తన ఉనికిని కాపాడుకున్న మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ బైక్ మంచి అమ్మకాలనే నమోదు చేస్తూ ప్రత్యర్థి కంపెనీ మోడళ్లకు గట్టి పోటీనే ఇచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ నుంచి తప్పుకోకతప్పడం లేదు.
భారత్లో మాత్రం ఇంకొన్నాళ్లు
అంతర్జాతీయంగా ఆర్సీ390 బైక్ను నిలిపేస్తున్న కేటీఎం.. యూరోపియన్ మార్కెట్, యూకే డీలర్ షిప్ లలో ప్రస్తుతం ఉన్న స్టాక్ను 2026 వరకు విక్రయించనుంది. అయితే భారత మార్కెట్లో కేటీఎం ఆర్‌సీ390 బైక్ ఇంకొన్నాళ్లు కొనసాగుతుంది. సరిపడినంత డిమాండ్ ఇక్కడ ఇంకా ఉండటమే ఇందుకు కారణం. కేటీఎం మాతృ సంస్థ అయిన బజాజ్ ఆటో గొడుగు కింద ఈ బైక్ భారత మార్కెట్లో తయారవుతుండటం దీనికి అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తోంది.
కేటీఎం ఆర్‌సీ390 బైక్ ధర భారతదేశంలో ధర రూ .3.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా ప్రస్తుతం, బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ నుండి ఈ మోటార్ సైకిల్ ధరను కంపెనీ తొలగించింది. ఇది 373 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్తో, ఆరు-స్పీడ్ ట్రాన్స్ మిషన్తోనడుస్తుంది. 43 బీహెచ్పీ శక్తిని, 37 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.


