బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్స్ తయారీ సంస్థ అల్ట్రా వయొలెట్ తమ కొత్త యూవీ స్పేస్ స్టేషన్‌ను విజయవాడలో ప్రారంభించింది. ఇందులో ఎక్స్–47, ఎఫ్77 మాక్ 2, ఎఫ్77 సూపర్‌స్ట్రీట్ తదితర వాహనాలు అందుబాటులో ఉంటాయి.
చూడటానికి స్టైలిష్ డిజైన్ కలిగిన అల్ట్రా వయొలెట్ ఎలక్ట్రిక్ బైకులు.. ఎందుకుని వేరియంట్‌ను బట్టి 2.8 సెకన్లలో గంటకు 60 కి.మీ. వేగాన్ని అందుకోగలవు. ఒక్కసారి చార్జి చేస్తే 323 కి.మీ. వరకు రేంజ్ ఉంటుంది. ఈ బైకులు ప్రస్తుతం దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా అమ్మకానికి ఉన్నాయి. ఇవి అత్యుత్తమ పనితీరును అందించడం వల్ల ఎక్కువమంది.. ఈ బైకులను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.


