కోట్లు పెట్టి కారు కొన్నాడు.. సర్వీస్ సెంటర్‌లో ఊహించని షాక్! | Bengaluru Service Centre Crashes Rs 3.32 Crore Porsche 911 | Sakshi
Sakshi News home page

కోట్లు పెట్టి కారు కొన్నాడు.. సర్వీస్ సెంటర్‌లో ఊహించని షాక్!

Oct 21 2026 10:31 AM | Updated on Oct 21 2026 10:44 AM

Bengaluru Service Centre Crashes Rs 3.32 Crore Porsche 911

ఖరీదైన కారు కొనుక్కోవాలని చాలామంది కలలు కంటారు. అలాంటి కలను నిజం చేసుకుని పోర్షే 911 కారును కొనుగోలు చేసిన ఒక వ్యక్తికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. సర్వీసింగ్ కోసం ఇచ్చిన కారు.. సర్వీస్ సెంటర్ సిబ్బంది టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ప్రమాదానికి గురైంది. దీంతో కారు దెబ్బతినడమే కాకుండా.. ఘటన జరిగి మూడు నెలలు గడిచినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటన బెంగళూరులోని కేఆర్ పుర ప్రాంతంలోని, కాటమ్నల్లూరు బ్రిడ్జి సమీపంలో.. జూలై 23న ఉదయం సుమారు 10:50 గంటలకు జరిగింది. రూ.3.32 కోట్ల (ఎక్స్‌షోరూ) కంటే ఎక్కువ ఖరీదైన పోర్షే 911 కారును వీఎస్‌టీ మోటార్స్ సర్వీస్ సెంటర్‌కు సర్వీసింగ్ కోసం తీసుకెళ్లారు. ఆ సమయంలో కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సిబ్బంది.. ఎదురుగా వస్తున్న క్యాబ్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. అయితే.. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.

క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు ప్రకారం.. ఆయన ఓ ప్రయాణికుడితో కలిసి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్తున్నారు. సర్వీస్ రోడ్ జంక్షన్ వద్ద కుడివైపు మలుపు తీసుకునేందుకు వేగం తగ్గించిన సమయంలో, ఎదురుగా వచ్చిన పోర్షే కారు తన క్యాబ్‌ను ఢీకొట్టిందని ఆరోపించారు. పోర్షే డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెస్ట్ డ్రైవ్ సమయంలో డ్రైవర్ కారు నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని లేదా ఆ కారును నడపడంలో తగినంత అనుభవం లేకపోయి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

మూడు నెలలైనా స్పందన లేదు
ఈ ప్రమాదంపై కారు యజమాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వీసింగ్ కోసం కారును అప్పగిస్తే.. సిబ్బంది టెస్ట్ డ్రైవ్ సమయంలో ప్రమాదానికి గురిచేశారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం వీఎస్‌టీ మోటార్స్‌తో పాటు పోర్షే ఇండియా, పోర్షే జర్మనీ సంస్థలను కూడా సంప్రదించినట్లు తెలిపారు. పలుమార్లు ఈ-మెయిల్స్ పంపినా, సంప్రదించేందుకు ప్రయత్నించినా సరైన పరిష్కారం లభించలేదని ఆరోపించారు. గత కొన్ని వారాలుగా స్పందన కూడా నిలిచిపోయిందని వాపోయారు.

ఇదీ చదవండి: SBI కస్టమర్లకు అలర్ట్.. 3.8 లక్షల డేటా రికార్డులు లీక్?

పోర్షే 911 వంటి ఖరీదైన కారును కొనుగోలు చేసిన అనుభవం ఎంతో ప్రత్యేకంగా ఉండాల్సింది, కానీ ఇప్పుడు న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను కేవలం మానవ తప్పిదంగా పరిగణించి వదిలేయకుండా, బాధ్యత తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement