8.7 కోట్ల షేర్లలో బ్లాక్ డీల్స్..
న్యూఢిల్లీ: దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు తాజాగా బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్‌లో 8.7 కోట్ల షేర్లు(1.38 శాతం వాటా) కొనుగోలు చేశాయి. గ్రో బ్రాండుతో బ్రోకింగ్, వెల్త్‌మేనేజ్‌మెంట్ తదితర సేవలందించే కంపెనీలో రెండు అనుబంధ సంస్థల ద్వారా యూఎస్ వెంచర్ క్యాపిటల్ రిబ్బిట్ క్యాపిటల్ 8.7 కోట్ల షేర్లు విక్రయించింది. దీంతో గ్రోలో రిబ్బిట్ క్యాపిటల్ వాటా 8.29 శాతం నుంచి 6.91 శాతానికి తగ్గింది.
ఎన్‌ఎస్‌ఈ బ్లాక్ డీల్ గణాంకాల ప్రకారం ఒక్కో షేరుకి రూ. 219 సగటు ధరలో ఈ షేర్లలో లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రూ. 1,905 కోట్లుకాగా.. అత్యధికంగా కొటక్ మహీంద్రా ఎంఎఫ్ 0.33 శాతం వాటా(2.05 కోట్ల షేర్లు)ను రూ. 449 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో గ్రోలో కొటక్ ఎంఎఫ్ వాటా 1.89 శాతం నుంచి 2.21 శాతానికి బలపడింది. బ్లాక్‌రాక్ రూ. 295 కోట్లతో 1.34 కోట్ల షేర్లు కొనుగోలు చేసింది. ఈ బాటలో ఎంఎఫ్‌లు, బీమా సంస్థలు, ఎన్‌పీఎస్‌సహా.. సొసైటీ జనరాలి, బీఎన్‌పీ పారిబా, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, మోర్గాన్ స్టాన్లీ తదితర విదేశీ సంస్థలు సైతం గ్రో షేర్లు కొనుగోలు చేశాయి.


