న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో భారత మార్కెట్లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి ఆదాయం ఆర్జించినట్లు టెక్ దిగ్గజం యాపిల్ వెల్లడించింది. మ్యాక్ కంప్యూటర్ల విక్రయాలు, సర్వీసులు, ఐఫోన్ అప్‌గ్రేడ్‌లు ఇందుకు దన్నుగా నిల్చినట్లు తెలిపింది. ముఖ్యమైన మార్కెట్లలో ఒకటిగా భారత్ నిల్చిందని కంపెనీ సీఈవో జాన్ టెర్నస్ తెలిపారు. త్రైమాసికాలవారీగా భారత్‌లో ఐఫోన్ అప్‌గ్రేడ్‌లు అత్యధికంగా పెరిగాయని వివరించారు.
ఇక్కడ యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి యాపిల్ పే సేవలను కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అంతర్జాతీయంగా ఉత్తర–దక్షిణ అమెరికా, యూరప్, గ్రేటర్ చైనా, ఆసియా–పసిఫిక్ మార్కెట్లలో రికార్డు స్థాయి ఆదాయాలు వచ్చినట్లు టెర్నస్ పేర్కొన్నారు. సరఫరాపరమైన ఆటంకాలు, విదేశీ మారకంపరమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ గ్లోబల్‌గా ఐఫోన్లపై ఆదాయం 17 శాతం పెరిగి 57.6 బిలియన్ డాలర్లకు ఎగిసినట్లు వివరించారు.


