జియో 98 రోజుల ప్లాన్‌.. అదనపు ప్రయోజనాలివే! | Jio 98 days plan daily 2gb data unlimited benefits | Sakshi
Sakshi News home page

జియో 98 రోజుల ప్లాన్‌.. అదనపు ప్రయోజనాలివే!

Oct 29 2026 9:29 PM | Updated on Oct 29 2026 9:34 PM

Jio 98 days plan daily 2gb data unlimited benefits

మీరు జియో యూజర్‌ అయి ఉండి ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా ప్రయోజనాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్‌ మీ కోసమే. రిలయన్స్‌ జియో అందిస్తున్న రూ.999 రీఛార్జ్‌ ప్లాన్‌ మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ ప్లాన్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌, క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు ఏఐ ఆధారిత డిజిటల్ సాధనాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రోజుకు 2 జీబీ డేటా.. అపరిమిత కాలింగ్

జియో రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 98 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ వ్యవధిలో రోజుకు 2 జీబీ చొప్పున మొత్తం 196 జీబీ హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. దీనికి అదనంగా దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా ప్రయోజనం కూడా లభిస్తుంది.

జియోహాట్‌స్టార్‌, క్లౌడ్ స్టోరేజ్

ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనం కూడా ఉంది. అలాగే జియోఏఐక్లౌడ్‌లో 50 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చు. ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లను ఆన్‌లైన్‌లో భద్రపరచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

గూగుల్ జెమిని ప్రో, కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్లు

ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లో భాగంగా 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌, 12 నెలల కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గూగుల్ జెమిని ప్రో ద్వారా ఏఐ ఆధారిత సేవలను వినియోగించుకోవచ్చు. దీనితో పాటు 5,000 జీబీ క్లౌడ్ స్టోరేజ్‌, నానో బనానా వంటి ఏఐ ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్ల ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. కాన్వా ప్రో లైట్‌ ద్వారా డిజైన్లు, పోస్టర్లు, ఇతర సృజనాత్మక కంటెంట్‌ను రూపొందించుకోవచ్చు.

ఇదీ చదవండి: అంబానీ కొడుకులు.. అదుర్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement