జింబాబ్వే కెప్టెన్ సికందర్‌ రజా కీల‌క నిర్ణ‌యం | Sikandar Raza-Likely-Retire-International Cricket-After-2027-ODI WC | Sakshi
Sakshi News home page

జింబాబ్వే కెప్టెన్ సికందర్‌ రజా కీల‌క నిర్ణ‌యం

Oct 15 2026 4:29 PM | Updated on Oct 15 2026 5:05 PM

Sikandar Raza-Likely-Retire-International Cricket-After-2027-ODI WC

Photo Credit: Twitter

జింబాబ్వే వ‌న్డే, టీ20 కెప్టెన్ సికంద‌ర్ ర‌జా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వనున్న‌ట్లు తెలిపాడు. 2013లో జింబాబ్వే త‌రఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సికంద‌ర్ ర‌జా ఆ దేశం త‌ర‌ఫున అంత‌ర్జాతీయ టీ20ల్లో సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. 

అంతేకాదు 17 ఏళ్ల వ‌య‌సులో టీ20ల్లో అరంగేట్రం చేసిన సికంద‌ర్ ర‌జా జింబాబ్వే త‌ర‌ఫున అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా నిలిచాడు. 13 ఏళ్ల కెరీర్‌లో సికంద‌ర్ ర‌జా 22 టెస్టుల్లో 1,434 ప‌రుగులు, 159 వ‌న్డేల్లో 4,704 ప‌రుగులు, 144 టీ20ల్లో 3,244 ప‌రుగులు సాధించాడు. వచ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు సౌతాఫ్రికా, న‌మీబియా, జింబాబ్వేలు సంయుక్తంగా ఆతిథ్య‌మివ్వ‌నున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కెరీర్ ముగింపు ద‌శ‌లో సొంత‌గ‌డ్డ‌పై వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌నుండ‌డం ఒక వ‌రంలా భావిస్తున్న‌ట్లు తెలిపాడు. 

సికంద‌ర్ ర‌జా మాట్లాడుతూ..''ప్రతి క్రికెట‌ర్ ప్ర‌పంచక‌ప్ ఆడిన త‌ర్వాత రిటైర్ అవ్వాల‌ని క‌ల‌లు క‌న‌డం స‌హ‌జం. నా వ‌య‌సు రిటైర్మెంట్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది. స్వ‌దేశంలో జ‌రిగే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడే అవ‌కాశం ల‌భించ‌డం వ్య‌క్తిగ‌తం గా నాకు వ‌రం లాంటిద‌ని భావిస్తున్నా. రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే ఆలోచన ఎంతమాత్రం లేదు. 

ఒకవేళ 2027-30 సైకిల్‌లో జింబాబ్వే జింబాబ్వే జట్టు ప్ర‌పంచ‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టోర్నీలో ప్రవేశించిన‌ప్ప‌టికీ, నేను తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశం నాకు లేదు. అయితే డ‌బ్ల్యూటీసీ టోర్నీలో జింబాబ్వే ఆడ‌టాన్ని ఒక గొప్ప విష‌యంగా భావిస్తాను. టెస్టుల్లో మేము అంత‌గా రాణించన‌ప్ప‌టికీ, మా ప్ర‌ద‌ర్శ‌న స్థాయి మాత్రం పెరుగుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. 

నా కెరీర్‌లో 22 టెస్టులు మాత్ర‌మే ఆడిన‌ప్ప‌టికీ, ఒక క్రికెట‌ర్‌గా ఎద‌గ‌డంలో టెస్టు ఫార్మాట్ కీల‌క‌పాత్ర పోషిందని చెప్ప‌గ‌ల‌ను. ఇక సొంత‌గ‌డ్డ‌పై వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న‌ప్ప‌టికీ మాకు పెద్ద‌గా ప్ర‌యోజనం లేద‌ని చెప్పొచ్చు. ఆతిథ్య హోదా ద‌క్క‌డం వ‌ల్ల మేము ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌గ‌లుగుతున్నాం. 

2027 అక్టోబ‌ర్ 24న విక్టోరియా ఫాల్స్‌లో కొత్త‌గా నిర్మించ‌న మోసి-ఓ-టున్యా అంత‌ర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్‌ను భార‌త్‌తో ఆడ‌నుండ‌డంతో క‌చ్చితంగా అది ప్ర‌త్యేక‌మే అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ కోసం మేము ఎంత‌గానో ఎదురుచూస్తున్నాం. ఇక వ‌ర్ద‌మాన క్రికెట‌ర్ల‌లో బ్యాట‌ర్‌ బ్రియాన్ బెన్నెట్‌, బౌల‌ర్ న్యూమాన్ న్యామ్హురిలకు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌నుకుంటున్నా.'' అని చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement